NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP : అభ్యర్థిని అవమానించేలా పోస్టర్లు.. చంద్రబాబు, లోకేష్ పై డీజీపీకి పిర్యాదు చేసిన వైసీపీ..!!

YSRCP : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే ప్రత్యర్థులను అవమాన పరిచేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు వివాదాస్పదం అయ్యింది. దీన్ని ఉదహరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తదితరులపై వైసీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

YSRCP leaders complaint to DGP against Chandrababu
YSRCP leaders complaint to DGP against Chandrababu

టీడీపీ ఫేస్ బుక్ లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ఉద్దేశిస్తూ “ఒకప్పుడు జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర విధేయుడిగా ఉన్న వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గురుమూర్తి ..” ఇప్పుడు పెద్దిరెడ్డి దగ్గర అంతే విధేయుడుగా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ సీపీలో దళితులకు ఎదిగే స్వేచ్ఛ లేదు అందుకే ఈ సారి “వినిపిద్ధాం తిరుపతి గొంతు లోక్‌సభలో లక్ష్మి గొంతు” అని పేర్కొంటూ సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను గురుమూర్తి వత్తుతున్నట్లుగా ఫోటో మార్ఫింగ్ చేసి ప్రచురించారు.

దీనిపై బాపట్ల వైసీపీ ఎంపి నందిగం సురేష్, వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌లు శుక్రవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు.  టీడీపీ పోస్టింగ్ తమ పార్టీ అభ్యర్థి గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్లు దళిత జాతి యావత్తు బావిస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ మరి కొందరు కుట్రపన్ని ఉద్దేశపూర్వకంగా దళితుడు అయిన గురుమూర్తిని అవమాన పరిచారని, కించపరచాలని తప్పుడు ఉలోచనలతో అవమానకరమైన రీతిలో పోస్టింగ్ ను తయారు చేసి వారి అధికారిక ఫేస్ బుక్ ద్వారా మరియు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తూ గురుమూర్తిని కించపరిచారని పేర్కొన్నారు. తక్షణం వారిపై చర్యలు తీసుకుని సదరు పోస్టింగ్ లన అధికారిక ఫేస్ బుక్ నుండి తొలగించేలా సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, లోకేష్ లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు కోరారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju