Subscribe for notification

YSRCP: వైఎస్ జగన్ పాలనకు మూడేళ్లు పూర్తి..వైసీపీ శ్రేణుల సంబరాలు

Share

YSRCP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన చేపట్టి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సందడి చేస్తూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ చార్జిలు, నేతల ఆధ్వర్యంలో పట్టణాల్లో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. తమ అభిమాన నేత పరిపాలనకు జేజేలు పలుకుతూ ర్యాలీలు చేశారు. మరో పక్క ఏపిలో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సంక్షేమ పాలనతో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

YSRCP leaders greetings to cm ys jagan

YSRCP: ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉండాలి

“మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుబెట్టుకుంటూ గడచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్క సారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశారు సీఎం వైఎస్ జగన్.

బైక్ ర్యాలీ లో విజయసాయి రెడ్డి

వైఎస్ జగన్ పరిపాలన చేపట్టి మూడేళ్ళు పూర్తి అయిన సందర్భంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విజయవాడ నుండి తాడేపల్లి వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్వయంగా బుల్లెట్ నడుపుతూ పాలుపంచుకుని యువతలో ఉత్సాహాన్ని కల్గించారు. జగన్ సీఎంగా పదవీ బాద్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నుండి రాజ్యసభ స్థానాన్ని పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పరిమళ్ నత్వాని ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. “మీ మూడేళ్ల పాలనలో ఏపి పలు రంగాల్లో మంచి అభివృద్ధి సాదించింది” అని నత్వానీ పేర్కొన్నారు. జగన్ ను డైనమిక్, విజనరీ లీడర్ అంటూ నత్వానీ అభివర్ణించారు.

 

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ 151 స్థానాలు కైవశం చేసుకుంది. 2019 మే 30న ఏపి సీఎంగా విజయవాడలో పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా ఆ తరువాత కొన్ని రోజులకు తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు.


Share
somaraju sharma

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

6 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

36 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago