NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: ‘మొహమాటానికి తావులేదు .. సర్వే రిపోర్టు ఆధారంగానే టికెట్లు’

YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సూచించారు. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్ధేశం చేశారు. పనితీరు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సర్వేల్లో పేరు లేకుంటే మొహమాటం లేకుండా టికెట్లు నిరాకరిస్తామని స్పష్టం చేశారు. గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి నెలా పది సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. జూలై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు జగన్ తెలిపారు. ప్లీనరీ తర్వాత మంత్రివర్గ వునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ.2కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

YSRCP legislative meeting YS Jagan
YSRCP legislative meeting YS Jagan

Read More: AP CM YS Jagan: సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం

YSRCP: బూత్ కమిటీలను బలోపేతం చేయాలి

ఏప్రిల్ పది నాటికి గ్రామస్థాయిలో ఉపాధి హామీ సహా అన్ని బిల్లులూ చెల్లిస్తామన్నారు. ఉగాదిన వాలంటీర్లకు సన్మానం, అవార్డులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఇక ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి రోజు నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తామని పేర్కొన్నారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలనీ, ఆ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలని చెప్పారు. ఏప్రిల్ నాటికి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్నారు.

జిల్లాల వారీగా రిజినల్ కోఆర్డినేటర్లు

కొత్త జిల్లాల వారీగా రీజినల్ కోఆర్డినేటర్లను నియమిస్తామని జగన్ చెప్పారు. అదే విధంగా 26 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించినందున ప్రజల్లోకి గర్వంగా వెల్లగలమని అన్నారు. ప్రస్తుతం మనం చేస్తున్న యుద్ధం చంద్రబాబుతోనే కాదనీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి మీడియాతోనూ అని అన్నారు. వీళ్లు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ ఎమ్మెల్యేలకు తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju