YSRCP: సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారనీ ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేసి 24 గంటలు కాకముందే మరో వైసీపీ ప్రజా ప్రతినిధి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా స్వపక్ష నాయకుల తీరుపై కామెంట్స్ చేశారు. బాలినేని తరహాలోనే తనకు ఇంటి పోరు తప్పట్లేదనీ అన్నారు. జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని అన్నారు కోటంరెడ్డి.
మూడు జిల్లాలకు ఇన్ చార్జిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక నాయకులు అండగా ఉండాలి కానీ సమస్యగా మారకూడదని అన్నారు. బాలినేని ఆవేదన తనకు బాధ కల్గించిందన్నారు. కొంత మంది పార్టీ ముఖ్య నేతలు వారి నియోజకవర్గాల్లో మరో సారి ఎలా గెలవాలో ఆలోచించకుండా ఇతర నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఇది పార్టీకి మంచిది కాదని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి. కొందరు తన నియోజకవర్గంలో బలహీనం చేయాలని చూస్తున్నారనీ, కానీ అది వాళ్ల వల్ల సాధ్యం కాదని అన్నారు. నియోజకవర్గ ప్రజల అండ, సీఎం జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకూ తననేమి చేయలేరని పేర్కొన్నారు కోటంరెడ్డి.
జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కలుగజేసుకునే సంబంధాలు తనకు ఉన్నాయనీ, కానీ కలుగజేసుకోవడం లేదన్నారు. పక్క నియోజకవర్గాల్లో ఏ పెళ్లి ఉన్నా, శుభకార్యాలు ఉన్నా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి చెప్పే తాను వెళుతున్నానని కోటంరెడ్డి అన్నారు. ఎవరి ఇల్లు వారు చక్కదిద్దుకోవాలని, పక్క ఇళ్లలోకి తొంగిచూసే సంస్కృతి మానుకోవాలని కోటంరెడ్డి వారికి హితవు పలికారు. ఒకరి తరువాత ఒకరుగా నిన్న బాలినేని, నేడు కోటంరెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై బాహాటంగా మాట్లాడటం వైసీపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇది ఇంతటితో ఆగుతుందా మరి కొందరు క్యూలో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…