YSRCP: ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ప్రభుత్వ సలహాదారులను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నియమించుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ఒక పక్క చెబుతూనే .. లక్షలాది రూపాయల గౌరవవేతనంతో దాదాపు 25 మందికిపైగా సలహాదారులను నియమించుకోవడంపై ప్రతిపక్షాల నుండి విమర్శలు కూడా వస్తున్నాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా జగన్ సర్కార్ సలహాదారుల సంఖ్య పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. విభజన హామీల అమలుపై ప్రస్తుత వైఖరి గురించి చెప్పడానికి వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ఓ అధ్బుతమైన కథను వినిపించారు. ఈ కథను ఆయన యాదృశ్చికంగా చెప్పారో లేక కావాలని చెప్పారో గానీ ఇప్పుడు అది జగన్మోహనరెడ్డి నియమించకున్న సలహాదారులను కించపరిచేదిగా ఉండటంతో చర్చనీయాంశమవుతోంది.
ఆయన చెప్పిన కథ ఏమిటంటే.. ఒక రాజ్యానికి మేలుచేయాలనుకున్న రాజు తన చుట్టూ ఉన్న మేథావులను పిలిపించారు. తమ వంతు సాయం చేయాలని కోరారు. మేం బ్రహ్మాండమైన పులి బొమ్మను గీయిస్తాం, తద్వారా సమస్యలను అధిగమించవచ్చు..ఇది గొప్ప విలువైన ఆస్తి కూడా అవుతుందని మేథావులు చెప్పారు. వారిలో ఒక మేథావి..తోక ఎక్కువ పొడవు ఉండకూడదు తగ్గించాలని చెప్పారు. చారలు ఎక్కువ గీయొద్దని మరో మేథావి సూచించారు. చెవులు తగ్గించాలని మరొకరు.. పంజా పెద్దగా ఉంది తక్కువగా ఉండాలని చెప్పి ఇంకొకరు.. ఇలా తమకు తోచిన సలహాలతో పులిబొమ్మను గీయించారు. అంతిమంగా పులి బొమ్మ కాస్తా పిల్లిలా రూపాంతరం చెందింది. ఇది మిథున్ రెడ్డి చెప్పిన కథ.
ఈ కథ చెప్పడం వల్ల మిథున్ రెడ్డి ఏమి సందేశం ఇవ్వాలనుకున్నారో చాలా మందికి అర్ధం కాలేదు. ఇక్కడ రాజు అనుకుంటే సీఎం జగన్మోహనరెడ్డి అనుకుందాం. మేథావులు అంటే ఇబ్బడిముబ్బడిగా నియమించుకున్న సలహాదారులు అనుకుందాం. అంటే ఇక్కడ ఒక్కరి సలహాతో ముందుకు వెళ్లకుండా అందరి సలహాలు క్రోడీకరించి పులి బొమ్మ గీయడంతో పులి బొమ్మ కాస్తా పిల్లిగా తయారైంది. మిథున్ రెడ్డి ఈ కథ ఎందుకు చెప్పారో ? దీనిలో అర్ధం ఏమిటో పాఠకులకు అయినా ఆర్ధం అవుతుందా ? మీరే గెస్ చేయండి ఆయన ఉద్దేశం ఏమిటో..!
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…