వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కావడం విశాఖలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఎంపీ బార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు ఆ కుటుంబానికి సన్నిహితుడు, ఆడిటర్ వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవి)ను కొందరు కిడ్నాప్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ అనంతరం రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. హైదరాబాద్ లో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకి కిడ్నాప్ వ్యవహారం తెలియడంతో హుటాహుటిన విశాఖకు బయలుదేరారు. ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ను కిడ్నాపర్ లు ఓ ఇంట్లో నిర్బందించినట్లు సమాచారం. బుధవారం జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేసినట్లు తెలుస్తొంది.

మొత్తం 17 బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు కిడ్నాపర్ల ఆచూకిని కనుగొన్నారు. విషయం బయటకు రావడంతో పోలీసులు స్పందించారు. ఎంపీ కుటుంబ సభ్యులు, ఆడిటర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని తెలిపారు. కిడ్నాపర్ల వివరాలను సాయంత్రం వెల్లడిస్తామన్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తొంది. అయితే కిడ్నాప్ నకు ముగ్గురు వ్యక్తులు పాల్పడినట్లుగా సమాచారం. ఈ ముగ్గురిలో రౌడీ షీటర్ హేమంత్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తొంది. హేమంత్ పై గతంలో పలు కిడ్నాప్ కేసులు ఉన్నాయి. కాగా ఈ కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలాన్ని రేపింది.
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్ధిని ఆత్మహత్య .. నిర్మల్ ఆసుపత్రి బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆందోళన..