NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: వైసీపీ వివిధ విభాగాల నేతలతో విజయసాయిరెడ్డి భేటీలు..బలోపేతానికి దిశానిర్దేశం

YSRCP:  వైఎస్ఆర్ సీపీ అనుబంధ విభాగాల ఇన్ చార్జిగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయా విభాగాల బలోపేతానికి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మహిళా విభాగం, రైతు విభాగం, ట్రేడ్ యూనియన్ నేతలతో భేటీ అయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్ కే రోజా, వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తదితర నేతలతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ కమిటీలు అన్నీ యాక్టివ్ అవ్వాలన్నారు. వైసీపీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కమిటీలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలన్నారు. ఆయా విభాగాల నేతలతో వేరువేరుగా సమావేశమై బలోపేతానికి దిశానిర్దేశం చేశారు.

YSRCP MP Vijaya sai Reddy review
YSRCP MP Vijaya sai Reddy review

YSRCP: ఎస్సీలంతా అప్రమత్తంగా ఉండాలి

మరో పక్క పార్టీ కార్యాలయంలో నవరత్న సంక్షేమ పథ‌కాల అవగాహన సభ జరిగింది. ఆల్ కమ్యూనిటీ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటి వ్యవస్ధాపకులు, నవరత్నాల పథ‌కాలను గురించి ప్రచారం నిర్వహించే పెద్దిపోగు కోటేశ్వరరావు సభకు సమన్వయకర్తగా వ్యవహిరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఎదో ఒక నెపంతో ఎస్సీలలో విభేదాలు సృష్టించి విభజన తీసుకురావాలనే కుట్రతో చంద్రబాబు పనిచేస్తున్నారని, ఎస్సీలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. దళితులకు న్యాయం చేసేది, చేయగలిగేది ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని విజయసాయిరెడ్డి అన్నారు. ఎస్సీలలో మూడు ఉప కులాలకు సంబంధించి మూడు కార్పోరేషన్ లను ఏర్పాటు చేసి రూ.18వేల కోట్లకు పైగా సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి గతంలో ఎవ్వరూ చేయనంతగా సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దళితులంతా ఐక్యంగా ఉండి వైసీపీకి మద్ద‌తుగా నిలవాలని కోరారు.

 

ఈ సభలో పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మన్, ఎంఎల్ ఏ మేరుగు నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, తదితరులు ప్రసంగించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju