NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ashok Babu: అశోక్ బాబు వ్యవహారం.. వైసీపీ ప్రభుత్వం విఫలమైనట్టేనా..?

Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తన పదోన్నతి సందర్భంగా విద్యార్హతలు తప్పుగా చూపారనే ఆరోపణలతో ఆయన్ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 477 (A ), 466, 467, 468, 471,465,420, R/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను సీఐడీ కార్యాలయానికి తరలించడం.. మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే.. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడ అశోక్ బాబును ఏ ఆరోపణలతో అరెస్టు చేశారో.. కోర్టులో అవే ఆరోపణలను నిరూపించలేకపోవడం మరొక ఎత్తు. ఇక్కడ రాజకీయ విమర్శలు పక్కనపెడితే.. అశోక్ బాబును కావాలనే కక్షతో అరెస్టు చేయించింది వైసీపీ ప్రభుత్వం అనే నిందను భరించాల్సి వస్తోంది.

ysrcp on ashok babu issue
ysrcp on ashok babu issue

నిజంగా అలా జరిగుంటే..

అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారనేది ప్రధాన అభియోగం. ఆయన ఇంటర్మీడియట్ మాత్రమే చదివి.. శాఖకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపణ. అయితే.. అశోక్ బాబు శాఖాపరమైన పరీక్షలు రాసి పదోన్నతి పొందారని అంటున్నారు. ఈ పరీక్ష పాసైతే డిగ్రీ అర్హత అవసరం లేదని తెలుస్తోంది. పదోన్నతి పొందిన తర్వాత కూడా నకిలీ సర్టిఫికెట్లు ఇస్తే అది కూడా నేరమే అవుతుంది. అయితే.. అశోక్ బాబుపై కోర్టులో ఈ వివరాలను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టులో ఇందుకు సంబంధించి ఆధారాలు ప్రవేశపెట్టామని చెప్తున్న ప్రభుత్వం ప్రజల ముందే ఆరోపణలు నిజం చేసినా ప్రభుత్వ వాదన సమర్ధనీయంగా ఉండేది.

ఏం సంకేతాలిస్తున్నట్టు..

కానీ.. ఇక్కడ అదేమీ జరగలేదు. పైగా.. బెయిల్ కూడా రావడంతో ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందా..? రాజకీయంగా తనపై విమర్శలు చేస్తే సహించేదా..? అనే సంకేతాలు ప్రభుత్వం తనకు తానే ప్రజల ముందు చూపుతున్నట్టు అవుతోంది. ఆరోపణలు నిరూపించే సందర్భంలో కోర్టులో ప్రభుత్వం విఫలమవుతోందనే విమర్శలకు ప్రభుత్వం తానే ఊతమిచ్చుకుంటోందని చెప్పాలి. పైగా.. అశోక్ బాబు అరెస్టుతో టీడీపీ నేతల నిరసనలు, అరెస్టులు, చంద్రబాబు పరామర్శలతో.. ప్రభుత్వం రాజకీయంగానే ఇదంతా చేస్తోందా..? అనే సంకేతాల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తోన్నట్టుంది. ఇటువంటి అంశాల్లో ప్రభుత్వం మరింత క్లారిటీతో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది..!

author avatar
Muraliak

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!