వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలకు భారీ వర్ష ప్రభావం తగిలింది. రెండు రోజుల పాటు జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వైఎస్ఆర్ ప్రాంగణంలో నిన్న అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మలు సమావేశాలను ప్రారంభించగా రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు హజరైయ్యారు.
అయితే శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రధాన వేదిక, టెంట్లు మినహా ప్లీనరీ ప్రాంగణం మొత్తం జలమయమైంది. వర్షం ధాటికి రెండు షామియానాలు కూలిపోయాయి. దీంతో నిర్వహకులు యుద్ద ప్రాతిపదికన షామియానాలను పునరుద్దరించారు. మరో పక్క వర్షాన్ని లెక్క చేయకుండా బారీగా వైసీపీ శ్రేణులు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. తొలి రోజు సమావేశాలకు లక్షా 60వేల మందికి పైగా తరలిరాగా నేడు సుమారు 5 లక్షల మంది పాల్గొంటారని అంచనాలతో నిర్వహకులు ఏర్పాట్లు చేశారు.
కాగా ఈ రోజు ప్లీనరీ సమావేశాల్లో అయిదు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. పాలన – పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు – ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు, ప్రభుత్వంపై దుష్ప్రచారం వంటి అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. పది గంటల నుండి ఈ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇక సాయంత్రం 3.30 గంటలకు వైసీపీ శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ను ఎన్నుకోనున్నారు. సాయంత్రం 4గంటలకు జగన్ ముగింపు సందేశం ఇవ్వనున్నారు.
బ్రేకింగ్ : వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా.. కారణం ఏమిటంటే..?
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…