YSRCP: మంత్రిగారి లీలలు – టీడీపీవారి లేఖలు..! ఇంటెలిజెన్స్ కి అంతుబట్టని టీడీపీ లేఖల వెనుక మంత్రి..!?

Share

YSRCP: టీడీపీ ప్రతిపక్షం.. వైసీపీ అధికార పక్షం.. ఎవరి బలం వారిది, ఎవరి రాజకీయం వారిది, ఎవరి బాగోతం వారిది..! అయితే ఆ రెండూ కలిస్తే.!? ప్రతిపక్ష టీడీపీ నేతలతో అధికార పార్టీ నేతలు సావాసం చేస్తే..!? టీడీపీ ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్న మంత్రి అంతర్గత లావాదేవీలు నడిపిస్తే..? అది డేంజరస్ రాజకీయం. అధికార పార్టీ అంటే చులకన ఏర్పడుతుంది. పరోక్షంగా అధికార పార్టీ బలహీనతకు.., టీడీపీ బలోపేతానికి.., సీఎం స్థాయి అన్నా చులకన అవ్వడానికి దోహదం చేస్తుంది..! ఆ జిల్లాలో అదే జరుగుతుంది. అందుకే అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి వరుసగా లేఖలు రాస్తూ సంచలన అంశాలు తెరమీదకు తెస్తున్నారు. ఆ జిల్లాలో టీడీపీ యాక్టీవ్ అవుతుంది.. వైసీపీకి వాయిస్ కరువవుతుంది..! అదే ప్రకాశం జిల్లా.. ఈ అంతర్గత రాజకీయ వ్యవహారంపై కాస్త లోతుగా పరిశీలిస్తే..

YSRCP: prakasam district political insider story
YSRCP: prakasam district political insider story

Read More: YS Jagan: 2024 వరకు జగన్ చేతిలోనే దేశం/ కేంద్రం..! రాష్ట్రపతి పాలన అంటూ టీడీపీ హడావిడి..!!

టీడీపీ వరుసగా లేఖలు.. అందుకే..!?

ఈ మధ్య తరచుగా ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖలు రాస్తున్నారు. మూడు నెలల కిందట “రాయలసీమ ఎత్తిపోతల వలన వెలుగొండ ప్రాజెక్టు”కి అన్యాయం అంటూ రాసిన లేఖ మొదలు.. పది రోజుల కిందట “సీఎం జగన్ జిల్లాకు వచ్చినా ఏమి చేయలేదు, ఏమి ఇవ్వలేదు” అంటూ లేఖ రాశారు. దాదాపు పది భిన్నమైన అంశాలతో పదిసార్లు లేఖలు రాశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టింది. టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలు రాయడం సహజంగానే ప్రతిపక్షంగా అది వారి బాధ్యత, వారి హక్కు, వారి పోరాటం. ఇంటెలిజెన్స్ వరకు సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు..! అయితే ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు కేవలం లేఖలు రాయడంతోనే ఆగిపోలేదు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ లేనట్టుగా ఆ జిల్లాలో టీడీపీ చురుకవుతుంది. కాస్త బలోపేతమవుతుంది. ఇటీవల జరిగిన బంద్ బలంగానే చేశారు. మొన్నటి చంద్రబాబు దీక్షకు ఆ జిల్లా నుండి భారీగా కార్యకర్తలు వెళ్లారు. నెలకోసారి ఆ జిల్లా ముఖ్యనేతలు సమావేశాలు పెడుతున్నారు. నియోజకవర్గాల వారీగా భారీ స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గిద్దలూరు వంటి బలమైన వైసీపీ నియోజకవర్గం నుండి రెడ్డి సామజిక వర్గ నేతలు టీడీపీలో చేరుతున్నారు. మొత్తానికి ఆ జిల్లాలో టీడీపీ తీరు ఆశ్చర్యకరం, అనూహ్యం..! దీని వెనుక ఎవరో కారకులు ఉంటారనే అధికార పార్టీ పెద్దల అనుమానాల మధ్య…. ఒక ఆసక్తికరమైన అంశం బయటకు వస్తుంది..

 

మంత్రి గారికి అన్నిటా అంతర్గత లావాదేవీలే..!

ఈ జిల్లాలో వైసీపీ కర్త, కర్మ, క్రియ మొత్తం ఆ మంత్రి గారిదే.. పార్టీ పెత్తనం, అధికార పెత్తనం మొత్తం ఆయనదే.. అయితే సదరు మంత్రి వ్యక్తిగత వ్యవహారాల కారణంగా జిల్లాలో అధికార పార్టీ చులకనవ్వుతుండగా.., టీడీపీ బలపడే ప్రమాదం ఏర్పడుతుంది.. సీఎం కి ఎవరైతే లేఖలు రాస్తున్నారో ఆ టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రికి సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకు కొన్ని ఉదాహరణలు ఆధారాలు కూడా ఉన్నాయి..!

 

* ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో అత్యంత చనువుగా.., కుటుంబ మనిషిగా ఉండేది రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్.. ఈయనకు ఆ మంత్రి మంచి సన్నిహితులు. రెండు నెలల కిందట ఈ ఇద్దరు, ఇంకా కొందరితో కలిసి రష్యా కూడా వెళ్లారు. అంతకు ముందు గోవా కూడా వెళ్లారు.. ఈ ఇద్దరికీ “కంబైన్డ్” అలవాట్లు, వ్యవహారాలు ఉన్నాయి. అలా జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా మంత్రికి సాన్నిహిత్యం ఉంది.

* పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఒక ఎరువులు, పురుగు మందుల తయారీ కంపెనీ ఉంది.. ఆ ఉత్పత్తుల్లో నిషేధిత మందులు ఉన్నట్టు గుర్తించి, విజిలెన్సు అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వాటిని అమ్ముతున్న దుకాణదారులను హెచ్చరించారు. దీనిపై “ఇది ప్రభుత్వ కుట్ర, కక్ష సాధింపు.. రాజకీయంగా ఎమ్మెల్యేను దెబ్బతీయాలని ఇలా చేస్తున్నారు” అంటూ ఎమ్మెల్యే వర్గం వాదిస్తుండగా.., ఎప్పుడో రెండున్నరేళ్ల కిందటి నుండి పట్టుకోవాల్సిన నిషేధిత మందులను ఇన్నాళ్లు ఎందుకు పట్టుకోలేదు..? అనేది వైసీపీ వాళ్ళ ప్రశ్న.. దానికి కారణం మంత్రి గారేనని భావిస్తున్నారు. ఈ కారణంగానే పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జిని కూడా మంత్రి మార్చనీయడం లేదని.. ఒక బలహీన అవినీతి ఆరోపణలు ఉన్న ఇంచార్జి ద్వారా తన హవా నడిపిస్తూ.., టీడీపీకి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారనేది వైసీపీలోనే కొన్ని వర్గాల్లో జరుగుతున్న చర్చ..!

* అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మొదటి నుండి కాంగ్రెస్ లో ఉంటూ.. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి.. ఆ తర్వాత 2015లో టీడీపీలో చేరి.. ప్రస్తుతం టీడీపీకి ఆ జిల్లాలో బలమైన నాయకుడిగా పార్టీకి పెద్దదిక్కుగా మారారు. ఈయనతో పాటూ మరో పది మందికి చెందిన గ్రానైట్ క్వారీల అవినీతిని బయటకు తీసి, ఫైన్లు, కేసులు వేశారు. రవికుమార్ టార్గెట్ గా ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతున్నప్పటికీ.., మంత్రి కొంత సహకరిస్తున్నారనే వాదన ఉంది. ఆయన మాట సాయం, మధ్య వర్తిత్వం ద్వారా గొట్టిపాటి వర్గానికి చెందిన కొన్ని క్వారీలు వైసీపీలోని ఓ కీలక నేత కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక్కడ కూడా ఇంచార్జి ద్వారా తన హవా నడిపిస్తూ టీడీపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని వైసీపీలో ఓ వర్గం ఆరోపిస్తుంది.

* దర్శి టీడీపీ ఇంచార్జిగా ఉన్న పమిడి రమేష్ కి చెందిన 14 ఎకరాల డంప్ క్వారీని కూడా ఈ మంత్రి గారి ప్రధాన అనుచరులు కొనుగోలు చేసినట్టు సమాచారం. అలా టీడీపీ వాళ్ళతో వ్యాపార, వ్యక్తిగత సంబంధాలు నడిపిస్తున్నారని జిల్లాలో అంతర్గత చర్చ ఉంది.

* ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు రావడం.. అక్కడ వైసీపీ బలహీనంగా ఉన్నట్టు పార్టీలో అందరికీ తెలిసినప్పటికీ ఇంచార్జిల మార్పునకు సీరియస్ ప్రయత్నాలు చేయకపోవడం.., ఆ టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రి గారికి అంతర్గత సంబంధాలు ఉన్నట్టు కొన్ని ఉదాహరణలు, కథనాలు రావడం.. ఈ వ్యవహారాలన్నీ దగ్గరగా అధ్యయనం చేస్తే వైసీపీ బలహీనతకు, టీడీపీ బలానికి మంత్రి పరోక్షంగా సహకరిస్తున్నారన్న వాదనలకు బలం చేకూరుతుంది..!

(జిల్లాలో అధికార పార్టీలో నియోజకవర్గాల వారీగా ఈ మంత్రిగారి పాత్ర.. ఏ నియోజకవర్గంలో ఏ విధంగా వేలు పెడుతున్నారు.., ఎక్కడెక్కడ టీడీపీలోకి చేరికలు ఎక్కువయ్యాయి..!? జిల్లాలో వైసీపీ అంతర్గత విభేదాలపై స్పష్టమైన వివరాలు.. తర్వాతి కథనంలో…)


Share

Related posts

అతన్ని వెంటనే మార్చండి : కేజ్రీవాల్

somaraju sharma

జోరు జోరుగా నిస్సాన్ మ్యాగ్నెట్ అమ్మకాలు.. ఒక్కరోజులోనే ఎన్ని డెలివరీలు ఇచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

bharani jella

ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రి..! జగన్ ఆదేశాలే ముఖ్యం..!!

Muraliak