YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో సారి భారీ ఎత్తున పదవుల పందేరం చేసింది. దాదాపు వంద మందికిపైగా నేతలకు పార్టీ అనుబంధ విభాగాల పదవులు లభించాయి. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తాజాగా అనుబంధ విభాగాలకు జోనల్ ఇన్ చార్జిలను నియమించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇన్ చార్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పార్టీ.

రాష్ట్రంలోని 26 జిల్లాలను ఎనిమిది జోన్ల్ లు గా విభజించి జోనల్ ఇన్ చార్జిలను నియమించింది. యువజన విభాగం, రైతు విభాగం, బీసీ సెల్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ విభాగం, పంచాయతీరాజ్ విభాగం, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, విద్యార్ధి విభాగం, వికలాంగుల విభాగం, వైఎస్ఆర్ సేవా దళ్ విభాగం, డాక్టర్ విభాగం, వాణిజ్య విభాగం, కల్చరల్ విభాగం, ప్రచార విభాగం, మహిళా విభాగం, గ్రీవియన్స్ సెల్, వీవర్స్ వింగ్ విభాగాలకు 136 మంది నేతలను జోనల్ ఇన్ చార్జిలుగా నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేయడం తో పాటు ఆ విభాగాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో అనుబంధ విభాగాల జోనల్ ఇన్ చార్జిల పేర్లను ఖరారు చేశారు. జోన్ల వారీగా అనుబంధ విభాగాలు, ఇన్ చార్జిలు, వారి నియోజకవర్గ వివరాలు ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి.
YSRCP Affiliated Wing Zonal Incharges
నవీన్ హత్య కేసులో కీలక పరిణామం .. హరిహరకృష్ణ స్నేహితురాలితో పాటు మరో యువకుడు అరెస్టు