NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ysrcp: జగన్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన వైసీపీ కార్యకర్తలు..!!

ysrcp protest against cm jagan

Ysrcp: విజయవాడలో బాలిక ఆత్మహత్య ఉదంతం బాలికలు, మహిళల రక్షణపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది. తనకు ఎదురవుతున్న దారుణ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక దయనీయ పరిస్థితుల్లో బాలిక ఈ లోకాన్ని వీడటం అందరి హృదయాల్ని బాధిస్తోంది. అయితే.. ప్రతీదీ రాజకీయం అయిన నేటి రోజుల్లో ఈ దారుణం కూడా రాజకీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా.. బాలికను వేధించిన వ్యక్తి ఓ టీడీపీ నేత. వయసు 50ఏళ్లుకు పైగా వయసు. నిందితుడికి శిక్ష కఠిన పడాలంటూ రాష్ట్రం మొత్తం నినదించింది. అయితే.. ఇలాంటి సమయాల్లో ప్రతిపక్షాలు రోడ్డెక్కి బాధితులకు న్యాయం జరగాలి.. ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్లు చేస్తాయి. కానీ.. ఇక్కడ రాజకీయ జోక్యం చేసుకుంది. జరిగిన ఘటనలో టీడీపీ నేత నిందితుడు కావడంతో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ధర్నాలు, నిరసనలతో రోడ్డెక్కింది.

ysrcp protest against cm jagan
ysrcp protest against cm jagan

ఎవరికి ఉపయోగం..?

ఘటనపై ఫ్లెక్సీలు వేసి అందులో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు వేసి మరీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు వైసీపీ నేతలు. జిల్లా, నియోకవర్గ కేంద్రాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. నిందితుడు టీడీపీ వ్యక్తి కావడంతో వైసీపీ నేతలు ఇలా ప్రదర్శనలు చేశారు. కాకుంటే.. ఈ విధంగా చేసేవారా..? అనేది ప్రశ్న. ఘటనపై హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. అయినా.. వైసీపీ నేతల నిరసనల ప్రదర్శన చూస్తుంటే తమ ప్రభుత్వ హయంలో మహిళలకు రక్షణ లేదని ఒప్పుకుంటున్నారా..? అనే అనుమానం కలిగించేలా ఉందన్న విమర్శలూ వస్తున్నాయి.

రాజకీయం ముఖ్యమా.. న్యాయం ముఖ్యమా..?

జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేయడంలో అర్ధం ఉంది కానీ.. రాజకీయ రంగు పులిమి చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు వేసి టీడీపీని నిందిస్తే ఒరిగేదేమీ లేదు. నిందితుడు టీడీపీ వ్యక్తి అని తేలాక కొత్తగా వైసీపీ నేతలు ప్రచారం చేయడంలో అర్ధం లేదు. టీడీపీ నుంచి నిందితుడ్ని సస్పెండ్ చేయడం కంటి తుడుపు చర్య.. రాజకీయం అని అందరికీ తెలుసు. కానీ.. వైసీపీ శ్రేణులు టీడీపీ హయాంలో, తమ హయాంలో జరిగిన దారుణాల పర్సంటేజీ.. అంటూ చెప్తున్న లెక్కల వల్ల ఎవరికి లాభం. ఇటువంటి దారుణాలు జరుగకుండా చట్టాలు మరింత కఠినతరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ పని సక్రమంగా చేయనిద్దాం..!

author avatar
Muraliak

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju