Subscribe for notification

YSRCP Rajya Sabha: ఏపి వైసీపీ రాజ్యసభ స్థానాల్లో అనూహ్యంగా తెరపైకి కొత్త నేత పేరు..?

Share

YSRCP Rajya Sabha: త్వరలో ఏపి నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఖాళీ అవుతున్న ఏపి, తెలంగాణతో సహా 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. ఏపి నుండి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలం వరకూ విజయసాయి రెడ్డి, బీసీ సామాజికవర్గానికి చెందిన బీదా మస్తాన్ రావు, కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి, ఆదానీ కుటుంబం నుండి ఒకరికి అవకాశం లభించనున్నట్లు ప్రచారం జరగ్గా, అదానీ కుటుంబం రాజ్యసభ రేసులో లేదని స్పష్టం అయ్యింది. మీడియాలో వస్తున్న కథనాలను ఆదానీ గ్రూపు ఖండించింది. అయితే అనూహ్యంగా మరో ఇద్దరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

YSRCP Rajya Sabha candidates..?

 

YSRCP Rajya Sabha: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆర్ కృష్ణయ్య

వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్ రావు పేర్లు దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తుండగా, మరో రెండు స్థానాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ తరుణంలో బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోవడంతో రాజ్యసభ అభ్యర్ధిత్వంపై చర్చించేందుకే వచ్చారని ప్రచారం జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో సీఎం వచ్చే వరకూ ఆర్ కృష్ణయ్య వెయిట్ చేసి సాయంత్రం కలుస్తారని సమాచారం. ఆర్ కృష్ణయ్య గతంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎం రామ్మోహన్ గౌడ్ పై విజయం సాధించారు. 2018 తరువాత ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. బీసీ సంక్షాల అధ్యక్షుడుగా కీలక పాత్ర పోషిస్తున్నారు.

file photo

ఏపిలో వైసీపీ  సర్కార్ కు అనుకూలంగా..

అయితే ఏపిలో వైసీపీకి ఆర్ కృష్ణయ్య అనుకూలంగా ఉన్నారు. గత ఏడాది సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్ పాలనను ప్రశంసలతో ముంచెత్తారు. ఎక్కడా అవినీతి తావులేకుండా పాలన అందిస్తున్నారనీ, జనరంజకమైన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారని ఆర్ కృష్ణయ్య నాడు ప్రశంసించారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులకు సంబంధించి 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టబద్దత కల్పించారనీ, 56 బీసీ ఉప కులాలకు కార్పోరేషన్లు నెలకొల్పడంపై ఆర్ కృష్ణయ్య కితాబు ఇచ్చారు. బీసీ వర్గాల్లో మంచి పట్టు ఉన్న నేత అయిన ఆర్ కృష్ణయ్య వైసీపీ తీర్ధం పుచ్చుకుంటే పార్టీకి మరింత ప్లస్ అవుతుందన్న భావనలో జగన్ ఉన్నట్లు సమాచారం.

 

అందుకే ఆర్ కృష్ణయ్యకు అపాయింట్మెంట్ ఖరారు చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అనంతరం దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరో రాజ్యసభ స్థానాన్ని జగన్ వ్యక్తిగత న్యాయవాది, సినీ నిర్మాత నిరంజన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం వైఎస్ జగన్ చివరి నిమిషంలో ఎటువంటి నిర్ణయాలను వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీ, రెండు రెడ్డి సామాజిక వర్గాలకు ఇస్తారా..? లేక ఒకటి మైనార్టీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం కల్పిస్తారా..? అనేది తేలాలంటే ఒకటి రెండు ఆగాల్సిందే!.

 

 


Share
somaraju sharma

Recent Posts

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

44 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

6 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

7 hours ago

Ram Pothineni Boyapati: రామ్ పోతినేని మూవీకి కూడా బాలకృష్ణ హిట్ ఫార్ములా వాడుతున్న బోయపాటి..??

Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…

9 hours ago