NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: ఈ సారి జగన్ ను నమ్ముకుంటే కష్టమే..? కొంపముంచుతున్న నేషనల్ సర్వే రిజల్స్..??

CM YS Jagan 1000 Days: How Many Marks..!?

YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఎన్నికల ఫలితాలు రికార్డుగానే చెప్పుకోవచ్చు. 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22  పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఘనత మొత్తం వైసీపీ అధినేత, సీఎం జగన్మోహనరెడ్డిదే అని చెప్పకతప్పదు. గెలిచిన 151 మందిలో కొద్ది మంది మాత్రమే వారి వ్యక్తిగత చరిష్మా తోడై ఎన్నికల్లో గెలిచారు కానీ ఎక్కువ శాతం మంది ఫ్యాన్ గాలిలోనే బయటపడారు అనేది వాస్తవం. జగన్ పాదయాత్ర, జగన్ ప్రచారం, జగన్ పై ఉన్న నమ్మకంతోనే జనాలు ఊహించని ఘన విజయాన్ని ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కాగా నెరవేరుస్తున్నారు.

YSRCP shocking survey report ..?
YSRCP shocking survey report

YSRCP: అంతర్గత విభేధాలు, ఆధిపత్య పోరు

రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నవరత్న పథకాలను కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘన విజయాలను సొంతం చేసుకుంది వైసీపీ. అయితే జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాల అమలుపై చూపుతున్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టడం లేదన్న విమర్శ ఉంది. అయితే జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాల వల్ల కొన్ని వర్గాలు వైసీపీకి దూరం అయ్యాయనీ, ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. కొన్ని జాతీయ సర్వే సంస్థలు ఇటీవల నిర్వహించిన సర్వేలో వైసీపీకి 2019లో ఉన్న పరిస్థితి లేదని వెల్లడించాయట. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల్లోనే అంతర్గత విభేధాలు, ఆధిపత్య పోరు. అక్రమ వ్యాపారాలు తదితర అంశాల కారణంగానూ పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని టాక్.

వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేలా..

అనేక రకాల కారణాలు, సర్వే రిపోర్టుల ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్న నేపథ్యంలో తమకు మళ్లీ టికెట్ ఇస్తారా..? లేదా..? అనే భయం కొందరిలో నెలకొందట. అందుకే కొందరు తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేలా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారుట. ఒక వేళ టికెట్లు ఇవ్వకపోయినా రెబల్ గా గెలిచి తిరిగి పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తారనే ప్రచారం ఉంది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju