NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: ఇద్దరు ప్రజాప్రతిధుల ఆధిపత్యపోరు..! వైఎస్సార్సీపీకి తలపోటు..!!

YSRCP: రాజకీయంలో వేర్వేరు పార్టీల మధ్య ఆధిపత్య ధోరణి, ప్రాంతీయ నాయకుల మధ్య వైరం.. ఇవన్నీ సహజమే. కానీ.. అధికారంలో ఉన్న పార్టీ నేతల్లో.. అదీ ఒకే ప్రాంతానికి చెందిన నేతల మధ్య విబేధాలు, ఆధిపత్య హోరు మొదలైతే పార్టీకి తలనొప్పే. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం చాలా కష్టం. వారు చేసుకునే పరస్పర ఆరోపణలు పార్టీకి నష్టం కూడా చేస్తాయి. ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఇదే జరుగుతోంది. వారిద్దరూ అధికార పక్షానికి చెందిన వారే అయినా ఆధిపత్య హోరు నడుస్తోంది. దీంతో ఇద్దరి పంచాయతీ అధిష్టానానికి చేరింది. ఇద్దరికీ సామరస్యపూర్వకంగా చెప్పడమూ, హెచ్చరించడం కూడా జరిగిందని భోగట్టా. అయినా.. ఒకరిపై మరొకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం వార్తల్లో నిలుస్తోంది.

ysrcp worrying with two leaders
ysrcp worrying with two leaders

ఒకరికి తెలీకుండా మరొకరు..

ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య నువ్వా-నేనా అన్నట్టు వ్యవహారం కొనసాగుతోందని తెలుస్తోంది. వైరి వర్గాల్లోనూ అనుచరులు భారీగానే ఉన్నారు. ఇద్దరికీ అధినాయకుడి దగ్గర మంచి మార్కులే ఉన్నాయి. కానీ.. స్థానికంగా మాత్రం ఇద్దరూ కలిసి పని చేయడం లేదని తెలుస్తోంది. తన నియోజకవర్గంలోకి ఎంపీ రాకూడదనేంతగా వైరం పెరిగిపోయిందని అంటున్నారు. దీంతో ఒకరికి తెలీకుండా మరొకరు వారి వారి ప్రాంతాల్లో విషయాలు తెలిసేలా కొందరిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారింది. క్షేత్రస్ధాయిలో పట్టు ఉండటం.. వైసీపీకి బలం, బలగం ఎక్కువగా ఉండటంతో గత ఎన్నికల్లో మంచి విజయాలే సాధించారు. కానీ.. ప్రస్తుతం వీరి వ్యవహారం నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

త్వరగా మేల్కోకుంటే..

ఇటువంటి పంచాయతీలు గతంలో టీడీపీ హయాంలో కూడా జరిగాయి. అయితే.. చంద్రబాబు నాయకుల మధ్య విబేధాలుంటే వెంటనే పరిష్కారం చూపేవారు. అప్పట్లో చిత్తూరు ఎంపీ వరప్రసాద్ ఏకంగా చంద్రబాబుపైనే విమర్శలు చేయడం వెంటనే పరిష్కరించడం జరిగాయి. కానీ.. ప్రస్తుతం వైసీపీలో వీరిద్దరి తీరు చాప కింద నీరులా మారుతోంది.  ఆ ప్రాంతంలో బలంగా ఉన్న వైసీపీపై వీరి సమస్యల ప్రభావం పడకుండా, ప్రజల్లో చులకన కాకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది. మరి.. పార్టీ వీరిద్దరి మధ్యా సయోధ్య ఎప్పటికి కుదిరేలా చేస్తుందో చూడాలి.

author avatar
Muraliak

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju