YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అర్ధాంతరంగా అమెరికా ఎందుకు వెళ్లారంటే..? ఇదీ క్లారీటీ..!!

Share

YV Subba Reddy: ఇటీవల వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా రెండవసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెండవ సారి టీటీడీ చైర్మన్ పదవి తీసుకోవడానికి వైవీ ఇష్టంగా లేరనీ, అందుకే అమెరికా వెళ్లారంటూ ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఎట్టేకలకు ఆయన అమెరికా నుండి వచ్చిన తరువాత టీటీడీ చైర్మన్ గా రెండవ సారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి నేడు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. టీటీడీ చైర్మన్ పదవి రెండవ సారి ఇష్టంగానే చేపట్టారా తదితర విషయాలను పంచుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఎంపిగానో లేక మంత్రిగానో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఆశపడుతున్నారంటూ వార్తలు వచ్చాయి.

YV Subba Reddy given clarity on America tour
YV Subba Reddy given clarity on America tour

Read More: Raghuramakrishnam Raju: బీజేపీ – వైసీపీ స్ట్రాంగ్ దెబ్బ వేసిన ఆర్ఆర్అర్ ? విజయసాయిరెడ్డి పదవికి ఎసరు ?

దీనిపై వైవీ సుబ్బారెడ్డి ఎమన్నారంటే ..”ఏ పదవి అయినా మనం కోరుకోవచ్చు కానీ అది రావడం మన చేతిలో ఉండదని అన్నారు. ప్రత్యేకించి టీటీడీ చైర్మన్ పదవి అనేది దైవ సంకల్పం, దైవానుగ్రహంతో పొందగలిగాను, సీఎం జగన్ ఇస్తే వచ్చిన అవకాశం. ఇంతకన్నా గొప్ప అవకాశం ఏదీ ఉండదు. ఈ పదవిలో ఉన్న సంతృప్తి, దేవుడికి సేవ చేసుకునే భాగ్యం, ప్రధమ సేవకుడిగా అది కూడా రెండవ సారి అవకాశం ఇవ్వడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఎంపిగా వెళ్లాలని ఎందుకు ఇష్టం ఉండదు. ఉంటుంది. అయితే దీనితో ఏ పదవిని పోల్చలేము అని అన్నారు వైవీ. ఇది దేవుడికి సేవ చేసుకునే భాగ్యం. మిగతా పదవులు రాజకీయంగా ప్రజలు అందుబాటులో ఉండి ప్రజల కోసం చట్టసభల్లో ఉండి పోరాటం చేసే దానికి అవకాశాలు ఉంటాయి అన్నారు. భగవంతుడి అనుగ్రహం, ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈ పదవి మరో సారి చేపట్టానన్నారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ భాధ్యతలు నిర్వహించడం తన విధి అన్నారు. టీటీడీ పదవి రెండవ సారి చేపట్టడం ఇష్టం లేకపోవడం వల్ల అమెరికా వెళ్లారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రెండు నెలల క్రితమే అమెరికా పర్యటనకు సంబందించి షెడ్యుల్ ఖరారు అయ్యిందని, తమ సతీమణి వైద్య పరీక్షలకు సంబంధించి ఆపాయింట్మెంట్ ఉండటం వల్ల వెళ్లడం జరిగిందన్నారు.

ఇక తన కుమారుడు విక్రాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పట్లో ఆ ప్రయత్నం ఏమి లేదన్నారు. ఆయన తన వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. సీఎం కి చేదోడు వాదోడుగా అండి తన వ్యాపారాలను నిర్వహించుకున్నారని చెప్పారు. పార్టీల తన స్థానం అందరితో పాటు జనరల్ సెక్రటరీల్లో ఒకడినని అన్నారు. తన దృష్టికి పార్టీ శ్రేణులు తీసుకువచ్చిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళుతుంటానని చెప్పారు.  కరోనా నుండి ప్రజలకు విముక్తి కలిగేందుకు టీటీడీలో సుందరా కాండ పారాయం, యాగాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.

వైసీపీలో నాలుగైదు పవర్ సెంటర్ అంటూ ఏమి లేదనీ, పవర్ సెంటర్ ఒక్కటే, సీఎం జగన్ ఒక్కరే మొత్తానికి పవర్ సెంటర్ గా ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాంతీయ పార్టీలోనైనా అదే విధంగా ఉంటుందన్నారు. ఇక రాజధాని విషయంపై మాట్లాడుతూ రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకోవాలనుకున్న వారు కోర్టులో పిటిషన్ లు వేసి అనిశ్చితికి కారణమైయ్యారనీ, తాత్కాలికంగా మాత్రమే ఆపగలిగారన్నారు. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజలు మద్దతు ఉందనీ,  కోర్టు నుండి సానుకూల తీర్పు వస్తుందని వైవీ ధీమా వ్యక్తం చేశారు.


Share

Related posts

BREAKING: ఇవాళ సాయంత్రం ఒకే స్టేజి మీద ఆమిర్‌ఖాన్‌, చిరంజీవి..!

amrutha

మోడీ రామాలయ నిర్మాణానికీ – ప్రభాస్ ఆదిపురూష్ కీ లింక్ ఉందా ?

GRK

సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇక లేరు

somaraju sharma