Author : siddhu

https://newsorbit.com - 1292 Posts - 0 Comments
ట్రెండింగ్ న్యూస్

జగన్ డిల్లీ టూర్ క్యాన్సిల్ అయినా  కానీ… శుభవార్త అందింది 

siddhu
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్న దశలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి    కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసేందుకు సన్నద్ధమైన విషయం రాజకీయంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది....
5th ఎస్టేట్

రామోజీ మనసు జగన్ పై పడింది… జోస్యం ఇదే!

siddhu
  ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే…. ఈనాడు పత్రిక జగన్ సర్కారుకు అండగా నిలుస్తోంది. సాక్షి పేపర్ కన్నా లోతుగా జగన్ గురించి పాజిటివ్ గా వీరు విశ్లేషిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర పాఠకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా తో మనం సహజీవనం చేయాల్సిందే అని ఏపీ సీఎం జగన్ మొదట్లో అన్నప్పుడు ప్రతిపక్షాలు మరియు ఎల్లోమీడియా అవహేళన చేయగా ఆ సమయంలో ఈనాడు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణమూర్తి కరోనా పై మాట్లాడిన మాటలు జగన్ అభిప్రాయాలను సమర్థించినట్లు ఉన్నాయి అని జగన్ కు చేదోడు వాదోడుగా నిలచింది. సాధారణంగా ఈ పని చేయాల్సిన సాక్షి పత్రిక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం గమనార్హం.   ఆ ఒక్కటేనా…! జగన్ సర్కార్ యొక్క పరపతిని మరియు పాలనాదక్షత ను తెలియజేసే విషయాలన్నింటినీ ఈనాడు మొదటి పేజీలో ప్రచురించడం మొదలు పెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప మరి ఏ ఇతర మార్గాల్లో రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏ ఒక్క పని జగన్ చేయడం లేదని బలంగా విమర్శలు వినిపిస్తున్న దశలో ఈనాడు రాష్ట్రంలో ‘9 భారీ పరిశ్రమలు’ పేరుతో ఒక శీర్షిక ప్రచురించి అందరి దృష్టిని ఆకర్షించింది. 18 వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఈ కథనంలో వారు చెప్పగా దానిలో లోతుగా వెళితే మరిన్ని ఆసక్తికర విషయాలు జగన్ కు పాజిటివ్ గా అందులో ఉన్నట్లు తెలిసి వస్తాయి. ఎప్పుడు జగన్ ను వీలైనంత వరకు విమర్శించే ఈ పత్రిక ఒక్కసారిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఏమిటని రాష్ట్ర ప్రజలు విపరీతంగా తలలు గోక్కుంటున్నారు. అయితే కొద్దిగా ఆలోచిస్తే దీనిలో ఇద్దరికీ పరస్పర లాభం ఉంది అన్న విషయం మనకు బోధపడుతుంది. కొద్ది రోజుల క్రితమే జగన్… సినీ ఇండస్ట్రీ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలు అన్నింటిలో ఉచితంగా షూటింగ్ చేసుకోవచ్చని ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే జగన్ తన రాష్ట్రంలో కూడా పటిష్టమైన చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుపుతున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమే చర్చించిన విషయం కూడా అందరికి తెలిసిందే. ఇక చిత్రపరిశ్రమలో రామోజీరావు ఈ యొక్క స్థాయి తెలియనిది కాదు. ఇప్పుడు ఎవరు ఎవరితో డీల్ కుదుర్చుకున్నారన్న విషయం తెలియదు కానీ మొత్తానికి ఈనాడు పత్రికలో జగన్ గురించి పాజిటివ్ రిపోర్టులు రావడం మరియు జగన్ నెమ్మదిగా చిత్ర సీమకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను…. ఆఫర్లను జారీ చేయడం యాదృచ్చికంగా జరిగింది అయితే కాదు అన్నది నిపుణుల మాట....
ట్రెండింగ్

స్ట్రాంగ్ లాయర్ తో నిమ్మగడ్డ కి చెక్ పెట్టిన జగన్

siddhu
  రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరొక మేజర్ ట్విస్టు చోటుచేసుకుంది.   జగన్ సర్కారు హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానికి కౌంటర్ గా పిటిషన్ దాఖలు...
బిగ్ స్టోరీ

సెల్ఫ్ గోల్ వేసుకున్న నిమ్మగడ్డ… పవర్ మొత్తం జగన్ చేతిలోకి! 

siddhu
ప్రస్తుతం యావత్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం  మరో కొత్త మలుపు తీసుకుంది. హైకోర్టు తీర్పు యొక్క హైలెట్స్ ను టీవీలు బ్రేకింగ్ న్యూస్ గా వేయగానే నిమ్మగడ్డ లో అత్యుత్సాహం కట్టలు తెంచుకుంది. కోర్టు తీర్పులకు సంబంధించి మామూలుగా టీవీల్లో పూర్తిగా చూపించరు. వారికి కావలసిన బ్రేకింగ్ పాయింట్స్ జనాలను ఆకర్షించేందుకు వేసుకొని అసలైన విషయాన్ని వివరించరు. అంతేకాకుండా అందరికన్నా ముందుగా తామే ఈ న్యూస్ జనాలకు చేరవేయాలని ప్రతి రిపోర్టర్ ఉన్న విషయాన్ని తమకు నచ్చిన రీతిలో అర్థం చేసుకుని చెప్పేస్తుంటారు. సరే అసలు ఈ గొడవంతా ఎందుకు అంటే…. అసలు జడ్జి తన తీర్పులో ఏమి చెప్పారు అన్న విషయం కాపీ బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసిందని బ్రేకింగ్ న్యూస్ రూపంలో వచ్చిన వెంటనే నిమ్మగడ్డ హుటాహుటిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి కి ఫోన్ చేసి హైదరాబాద్ లోని తన నివాసానికి వాహనాలను పంపమన్నారు. ఇంకా అక్కడితో ఆగాడా…? కోర్టు తీర్పు ప్రకారం తానే కమిషనర్ గా వస్తున్నట్లు జిల్లాలో అన్నింటికీ సర్కులర్ పంపమని ఆదేశించి పనిలో పనిగా తాను బాధ్యతలోకి దిగి పోయినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టేశారు. అంతేకాకుండా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ ప్రభాకర్ ను రాజీనామా చేయమని ఆదేశించి…. అతనికి కొద్ది వ్యవధి కూడా ఇచ్చే అవకాశం లేదని హూంకరించాడు. ఇక ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనకరాజు వెంటనే తప్పుకోవాలని హుకుం జారీ చేసిన ఆయన పైన తతంగం అంతా పూర్తి చేసేసరికి సాయంత్రం అయింది. ఈ లోపల సాయంత్రం హైకోర్టు నుండి తీర్పు కాపీ వచ్చింది. అడ్వకేట్ జనరల్ శ్రీరాం దానిని మీడియా వారి ముందు పెట్టిన తర్వాత కానీ నిమ్మగడ్డకు అసలు విషయం బోధపడలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని చెబుతూ అవసరమైన ఏర్పాట్లు చేయమని కోర్టు చెప్పింది కానీ అందుకు ప్రభుత్వానికి ఎటువంటి గడువు విధించలేదు. అదే సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయమై హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో మళ్లీ కౌంటర్ పిటీషన్ వేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. కోర్టు వారు ఎటువంటి గడువు ఇవ్వలేదు కాబట్టి మిన్నగడ్డను పదవిలో నియమించేందుకు రెండు నెలల వ్యవధి ప్రభుత్వానికి ఇంకా ఉందని జస్ట్ శ్రీరామ్ వివరించారు. హై కోర్పు తీర్పుపై తాము సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతున్నట్లు చెప్పగానే నిమ్మగడ్డతో పాటు చంద్రబాబు అండ్ కో మొత్తం అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. హై కోర్టులో కేసు ఓడిపోతే సుప్రింకోర్టుకు వెళ్ళటం మామూలే కదా ? అంతెందుకు హైకోర్టులో  నిమ్మగడ్డే ఓడిపోయుంటే సుప్రింకోర్టుకు వెళ్ళేవాడు కాదా ? ఇంత చిన్న లాజిక్ కూడా మిస్సయిన నిమ్మగడ్డ ఇపుడు గోల ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మరో వైపు జగన్ మాత్రం నిమ్మగడ్డ చూపిన అత్యుత్సహంతో ఇప్పుడు పవర్ అంతా తన చేతుల్లో ఉందని గ్రహించి సుప్రీం కోర్టుకు మరింత ఉత్సాహంతో వెళుతున్నాడు....
న్యూస్

బ్రేకింగ్ : 2020 లో మరో దరిద్రం .. సింగరేణి కోల్ మైన్స్ లో !

siddhu
సింగరేణి కోల్ మైన్స్ లో ఎక్స్ ప్లోజన్ కారణంగా నలుగురు కార్మికులు చనిపోయారు అని తెలుస్తోంది. రామగుండం దగ్గరి పెద్దపల్లి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. OCP1 గాని లో ఈ సంఘటన జరిగింది.,...
న్యూస్

బ్రేకింగ్ : జగన్ డిల్లీ పర్యటన క్యాన్సిల్

siddhu
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి డిల్లీ పర్యటన ప్రస్తుతానికి క్యాన్సిల్ అయ్యింది. నిన్ననే ఫిక్స్ ఐన షెడ్యూల్ ఒక్కసారిగా మారింది . హోం మంత్రి అమిత్ షా వేరే...
న్యూస్

బ్రేకింగ్ : షూటింగ్ లకి అనుమతి, హీరోయిన్ ని ముద్దు పెట్టుకోకూడదు !

siddhu
మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతులు మంజూరు చేస్తూనే భలే రూల్స్ పెట్టింది. షూటింగ్ లో ఎక్కువ మండి బృందం ఉండకూడదు అనీ , సానిటైజర్ లూ మాస్క్ లూ తప్పనిసరిగా ఉండాలి అని...
ట్రెండింగ్

‘హెర్డ్ ఇమ్మ్యునిటీ’..! కరోనా పై ఇండియా టార్గెట్ ఇదే ! 

siddhu
  దశలవారీగా నెలల తరబడి లాక్ డౌన్ విధించినా కూడా కరోనా వైరస్ కేసులు విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్రతి రోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా వైరస్…. మన దేశంలో ఎప్పటికప్పుడు అత్యధికంగా కేసులు నమోదు చేస్తూ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన దేశాలలో ఏడవ స్థానంలో భారత్ నిలిపింది. నిన్న ఒక్కరోజే ఎనిమిది వేల పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రతి రాష్ట్రంలో కూడా తమ రోజువారి రికార్డును ప్రతిరోజు సవరణ చేసుకుంటూ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ నుండి కొన్ని కీలకమైన మినహాయింపులు ఇవ్వడంతో అసలు లాక్ డౌన్ అన్నది ఉందా లేదా అన్న విషయం కొన్ని ప్రాంతాల్లో అయితే స్పష్టంగా తెలియడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే కేంద్రం ‘అన్ లాక్’ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్క కంటెంట్మెంట్ జోన్ లను మినహాయించి అన్ని చోట్ల మాల్స్ తెరచుకునేందుకు అనుమతులను ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రారంభించడానికి ఓకే చెప్పేసింది. అతి తక్కువ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ పక్కాగా అమలు చేసి…. ఇప్పుడేమో ప్రజలకు స్వాతంత్రం కల్పించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కేంద్రం ఒక వ్యూహంతో వెళుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విషయం ఏమిటంటే కరోనాను లాక్ డౌన్ వల్ల తరిమికొట్టడం అసాధ్యమని కొద్దిరోజులకే అర్థం అయిపోయింది. ఇక లాక్ డౌన్ పేరుతో వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేసి…. ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే బదులు అందుకు ప్రత్యామ్నాయం ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే ఒక మార్గం ఉందని కేంద్రం తెలుసుకున్నారు. దీంతో కరోనా సోకకుండా ప్రజలను ఏమాత్రం కట్టడి చేయలేని అర్థమైన ప్రభుత్వం కరోనా వచ్చినా తట్టుకునే సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సామూహికంగా రోగనిరోధకశక్తి పెంచితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అని…. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్ వంటి దేశాలు ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు కూడా రుజువులు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని నేరుగా చెప్పి ఇష్టం వచ్చినట్లు మీరు బయట తిరగకండి అని చెబితే అనేక విమర్శలు వస్తాయి అని…. ప్రజలను కరోనాకు వదిలి పెట్టేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెడతాయి. దీనితో హెర్డ్ ఇమ్యూనిటీ దేశంలోని ప్రజల మధ్య రావాలి అంటే కొద్ది కొద్దిగా నిబంధనల ఎత్తివేత ద్వారానే అది సాధ్యం అవుతుంది. కేంద్రం ఇచ్చిన సడలింపులలో అతి కీలకమైనది చిన్న పిల్లలు మరియు వృద్ధులు బయటకు రాకపోవడం. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వైరస్ సోకినప్పుడు వారిని కాపాడుకోవడం కష్టం అవుతుంది. అందుకే సడలింపులలో కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అని నిబంధనలు విధించారు. యువతకు మరియు మధ్య వయస్కులకు వైరస్ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో నమోదు అయిన కేసుల్లో 70 నుంచి 80 శాతం మందికి అసలు లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలు బయట పడకుండా రోగనిరోధకశక్తి ప్రభావంతోనే చాలామందికి తగ్గిపోయి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ ప్రత్యేక పరీక్షలు చేసింది. పెద్ద ఎత్తున శాంపిళ్లను సేకరించింది. ఈ ఫలితాలతో కరోనా ఎంత మందికి సోకి నయమయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా వెళ్తున్నామో లేదో కూడా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు...
ట్రెండింగ్

జగన్ విషయం లో కేంద్రం అడుగులు షురూ..? పెద్ద న్యూస్ రానుంది ?  

siddhu
  ఆంధ్రప్రదేశ్లో లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముందుగా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తూ జగన్ సర్కారు   జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర హైకోర్టు...
న్యూస్

బ్రేకింగ్ : మందుబాబులకి సూపర్ గుడ్ న్యూస్

siddhu
  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లోని మందుబాబులక్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మొన్నటివరకూ ఆరుగంటలకే క్లోజ్ చేసే వైన్ షాపులని ఇప్పుడు ఎనిమిదింటి వరకూ ఓపెన్ చేసి ఉంచుతున్నారు. ఈ విషయం...