Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గత ఆదివారం ఎపిసోడ్ లో అభినయశ్రీ ఎలిమినేట్ కావడం తెలిసిందే. రెండో వారం ఎలిమినేషన్ కి సంబంధించి మొదటి నుండి అభినయశ్రీ పేరు వినబడుతూనే ఉంది. అయితే డబల్ ఎలిమినేషన్ కావడంతో మొదట షాని ఎలిమినేట్ అయిపోయాడు. ఆ తర్వాత అభినయశ్రీ ఆదివారం నాడు ఎలిమినేట్ అయింది. అయితే షో నుండి బయటకు వచ్చాక అభినయశ్రీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రోజుకి 40 వేల రూపాయలు చొప్పున మొత్తం మీద ఐదు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై వాస్తవం లేదని మీడియాకి తెలిపింది. ఈ క్రమంలో షో వల్ల తనకి బ్యాడ్ జరిగిందని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటుందని భావించిన హౌస్ లో తనకి అన్యాయం జరిగిందని తెలిపింది. ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించలేదని వాపోయింది. హౌస్ లో నేను వెళ్ళిన నాటి నుండి మా కుటుంబ సభ్యులు ప్రతి ఎపిసోడ్ చూశారని.. కానీ ఎక్కువగా తనకి స్క్రీన్ స్పేస్ లేదని తెలిపినట్లు.. అభినయశ్రీ చెప్పుకొచ్చింది.

ఇక బిగ్ బాస్ ఈ సీజన్ విన్నర్ ఎవరూ అవుతారు అని.. మీడియా వేసిన ప్రశ్నకు సంచలన సమాధానమిచ్చింది. ప్రతి నామినేషన్ లో రేవంత్, గీతూ ఉంటున్నారు. ఇద్దరూ కూడా సేవ్ అవుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్ అయ్యే అవకాశం ఉందని అభినయశ్రీ తన అభిప్రాయాన్ని తెలిపింది. మొత్తం మీద షోలో తనని ఎక్కువ చూపించలేదని.. అన్యాయం జరిగింది అన్నట్టు వాపోయింది. అయితే అభి చేసిన వ్యాఖ్యలపై బిగ్ బాస్ ఆడియెన్స్ పై మండిపడుతున్నారు. హౌస్ లో గేమ్ ఆడేవారిని చూపిస్తారు, కానీ …కూర్చుని ముచ్చట్లు పెటుకున్నే వారిని ఎందుకు చూపిస్తారు అని కౌంటర్ లు వేస్తున్నారు.