Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో వారం చివరికి వచ్చేసింది. అయితే కెప్టెన్సీ టాస్క్ బరిలో గీత రాయల్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య నిన్న సెలెక్ట్ కావడం తెలిసిందే. అయితే బ్రిక్స్ గేమ్ లో గీత రాయల్, ఫైమా.. అనర్హులయ్యారు. గేమ్ లో రూల్స్ అతిక్రమించి ఆడటంతో సంచాలకుడిగా ఉన్నా రేవంత్ ఇద్దరినీ అనర్హుడిగా ప్రకటించడం జరిగింది. అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ కి కెప్టెన్సీ టాస్క్ లో శ్రీ సత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి.. పోటీపడ్డారు. “ఎత్తరా జండా” అనే టాస్క్ నిర్వహించగా ఆదిరెడ్డి గెలవడం జరిగింది.

ఈ టాస్క్ లో కొద్దిపాటి తేడాతో శ్రీహాన్ ఓటమిపాలయ్యాడు. ఆదిరెడ్డి గెలవడంతో బిగ్ బాస్ అభినందనలు తెలియజేయడం జరిగింది. మొదటివారం చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడిన ఆదిరెడ్డి సెకండ్ వారం సైలెంట్ కావడం తెలిసిందే. అయితే మూడో వారం వచ్చేసరికి మంచి దూకుడుగా గేమ్ ఆడటం జరిగింది. దొంగ పోలీస్ టాస్క్ లో… పోలీస్ టీమ్ లో కీలకంగా రాణించాడు. పోలీస్ టీం విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.

ఈ క్రమంలో ఆదిరెడ్డి మూడో వారం కెప్టెన్సీ టాస్క్ గెలిచి సింహాసనం అధిరోహించడం జరిగింది. మరోపక్క ఆదిరెడ్డి మూడో వారం నామినేషన్ లో ఉన్నారు. మరి వారం సేవ్ అవుతారో లేదో చూడాలి. ఇక ఇదే సమయంలో వరస్ట్ కంటెస్టెంట్ గా అర్జున్ నీ జైలుకు పంపించడం జరిగింది. జీరో పెర్ఫార్మెన్స్ బోర్డు.. కీర్తి, అర్జున్, ఆరోహి లకి రావడం.. ఈ ముగ్గురు డిస్కషన్ చేసుకుని అర్జున్ వెళ్లడానికి ఓకే చెప్పుకోవడంతో వరస్ట్ పెర్ఫార్మర్ గా ఈ వారం అర్జున్ నీలిచాడు.