Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదవ వారం ఆట ఇంటి సభ్యుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఫిజికల్ టాస్క్ లు ఇవ్వటంతో ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. చేపల చెరువు టాస్క్ నిర్వహించడంతో అత్యధికమైన చేపలు పట్టుకోవడానికి ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు పడిపోతు… కొట్టేసుకుంటున్నారు. చేపలను చేజిక్కించుకోవడానికి దూకేస్తున్నారు. ఇదే సమయంలో బుట్టలో ఉన్న చేపలను రక్షించుకోవడానికి తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు.

అయితే ఈ టాస్క్ లో బాలాదిత్య గతానికి భిన్నంగా రెచ్చిపోయారు. ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి బాలాదిత్య… చాలా వర్క్ స్లోగానే గేమ్ ఆడటం జరిగింది. ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడినట్లు చాలా సందర్భాలలో తేలింది. తోటి కంటెస్టెంట్ నీ విమర్శించాలని భావించినా గానీ.. నామినేట్ చేయాలన్న.. చాలా సున్నితంగా సేఫ్ గా గేమ్ ఆడే వాడు. కానీ ఎనిమిదో వారంలో మాత్రం గతానికి భిన్నంగా తోటి కంటెస్టెంట్లపై బాలాదిత్య రెచ్చిపోయాడు.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా చెరువులో చేపలు.. ఆటలో.. శ్రీహాన్, శ్రీ సత్య టీంపై ఇంకా..ఫైమా, రాజ్ టీం ల దగ్గర ఉన్న చేపలను లాక్కోవడానికి బాలాదిత్య ఆడిన ఆట తీరు అందరికీ షాక్ కి గురి చేసింది. చాలా యాక్టివ్ గా ఇంక దూకుడుగా మిగతా టీములపై బాలాదిత్య రెచ్చిపోయాడు. కానీ చివరకు అన్ని టీముల దగ్గర కంటే తక్కువ చేపలు ఉండటంతో బుధవారం ఎపిసోడ్ లో అనర్హులుగా మిగిలిపోయారు. ఏది ఏమైనా సీజన్ స్టార్ట్ అయిన నాటి తర్వాత చాలా ఫిజికల్ గా బాలాదిత్య గేమ్ ఉండటం విశేషం.