Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో ఎపిసోడ్ శుక్రవారం జరిగింది. ఇప్పటికే మొదటివారం హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ఏడుగురు నామినేట్ కావడం తెలిసిందే. రేవంత్, సుల్తానా, ఫైమా, అభినయశ్రీ, ఆరోహి, చంటి, శ్రీ సత్య. ఈ ఏడుగురు మొదటి వారం ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ గురించి ఇంటి సభ్యులకు ” కెప్టెన్సీ బండి” అనే టాస్క్ నిర్వహించడం జరిగింది. ఈ టాస్క్ లో ఎవరికివారు తెగ పోటీపడ్డారు.

అయితే చివర ఆఖరికి బాలాదిత్య గెలవడం జరిగింది. దీంతో సీజన్ సిక్స్ ఫస్ట్ కెప్టెన్ గా బాలాదిత్య ఎన్నిక కావడం జరిగింది. ఈ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటి నుండి బాలాదిత్య.. హౌస్ లో పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నాడు. హౌస్ లో కెప్టెన్ కాకపోయినా కానీ అతడి మాటకి చాలామంది గౌరవం చూపిస్తూ పనులు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు కెప్టెన్ ఎవరు అవ్వాలి అని డిస్కషన్ జరిగిన సమయంలో కూడా హౌస్ లో చాలామంది సభ్యులు బాలాదిత్యకి మద్దతు తెలపడం జరిగింది.

ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో బాలాదిత్య.. కెప్టెన్సీ కావటానికి పెట్టిన టాస్క్ లో విజయం సాధించి బిగ్ బాస్ సీజన్ సిక్స్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయ్యారు. ఈ కెప్టెన్సీ టాస్క్ లో.. ఆదిరెడ్డి ఇంకా నేహా చౌదరి చాలామంది గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అయినా కానీ చివర ఆఖరికి విజయం బాలాదిత్యకి వరించింది.