Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రస్తుతం రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ గత ఐదు సీజన్ ల కంటే.. అట్టర్ ఫ్లాప్ అయ్యే దిశగా వెళుతుందని ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్. ఏకంగా సెకండ్ వీకెండ్ సమయంలో హోస్ట్ నాగార్జున సైతం .. ఎవరు ఆడటం లేదు హౌస్ లోకి చిల్ అవ్వడానికి వచ్చినట్టు. ఇంటి సభ్యుల తీరువందని గట్టిగానే అందరికీ క్లాసు పీకారు. ఈ క్రమంలో మూడో వారంలో కొద్దిగా యాక్టివ్ అయినా ఇంటి సభ్యులు సరిగ్గా గొడవ అయ్యే సమయానికి అందరూ కాంప్రమైజ్ అయిపోతున్నారు. కెమెరాలు చూస్తున్నాయి అంటూ ప్రతి దానికి డైలాగులు వేస్తూ తమ ఆట తీరును ఎవరు కూడా ఫుల్ గా చూపించడం లేదు.

మరోపక్క చూస్తే క్రికెట్ మ్యాచ్ లు జరుగుతూ ఉండటంతో.. సీజన్ సిక్స్ కి వ్యూస్ తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడినట్లు టాక్. ఇటువంటి తరుణంలో హౌస్ లో బలవంతపు లవ్ ట్రాక్ క్రియేట్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు గురువారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో పై విమర్శలు వస్తున్నాయి. ప్రోమోలో శ్రీ సత్య నేను హౌస్ లో అందరిని అన్నయ్య అని పిలుస్తాను. అవతల వాళ్ళు తీసుకుంటారో లేదో.. వాళ్ళ ఇష్టం. నేను మాత్రం అన్నయ్య అని మాత్రమే పిలుస్తాను అని అర్జున్ కి తెలియజేస్తుంది.

ఈ క్రమంలో ప్రోమోలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకి లవ్ ట్రాక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ..షో నిర్వాహకులు ఇవ్వటం పట్ల ఆడియన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. ఆ అమ్మాయి వద్దన్నా గాని షో లేపటం కోసం ఈ రీతిగా జాకీలు వేయటం దారుణమని అంటున్నారు. గతంలోనే నేను లవ్ ట్రాక్ కి కంటెంట్ ఇవ్వను. హౌస్ లోకి నేను డబ్బులు సంపాదించడానికి, ఫేమ్ సంపాదించడానికి మాత్రమే వచ్చినట్లు… శ్రీ సత్య క్లారిటీ ఇచ్చింది. అయినా కానీ బలవంతపు పులిహార లవ్ ట్రాక్ కి షో నిర్వాహకులు శ్రీకారం చుడుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. శ్రీ సత్య అర్జున్ ది మాత్రమే కాదు సూర్య ఇంకా ఆరోహి నీ కూడా అలాగానే చూపిస్తున్నారు అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.