Bigg Boss 6: గత సీజన్ ల కంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అసలు ఎవరు గేమ్ ఆడటం లేదని జనాలతో పాటు స్వయంగా నాగార్జున కూడా రెండో వారం వీకెండ్ టైంలో చెప్పడం తెలిసిందే. ఈ క్రమంలో మూడో వారం స్టార్టింగ్ లోనే ఇంటి సభ్యులకు బిగ్ బాస్ బిగ్ షాక్ ఇచ్చారు. ఈ వారం లగ్జరీ బడ్జెట్ లేదని.. కారణం అవసరం ఎవరు గేమ్ ఆడటం లేదని స్పష్టం చేశారు. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులంతా ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. హౌస్ లో ఎవరు కూడా పోటీ పడటానికి వచ్చినట్టు కాకుండా ప్రతి విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారు.
ఒక గీతు మరియు రేవంత్ మినహా.. కసిగా గేమ్ ఆడిన వాళ్ళు ఎవరు కూడా లేరని ఆడియన్స్ నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. కేవలం మంచితనం సంపాదించుకోవాలి ఇంకా సానుభూతి సంపాదించుకోవాలి అన్న విధంగానే మిగతా కంటెస్టెంట్లు ఆటతీరు ఉందని అంటున్నారు. ఇంకా మరి కొంతమంది అయితే బిగ్ బాస్ హౌస్ లో తినడానికి పడుకోవడానికి వచ్చినట్లు.. వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇలాగే గేమ్ వచ్చే రెండు వారాలు ఉంటే ఇంకా షో మధ్యలోనే ఆపేస్తే డబ్బులు మిగులుతాయి అని కూడా షో నిర్వహకులకు ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. గేమ్ పరంగా గీతు రాయల్, రేవంత్ ఆట మాత్రమే కనిపిస్తోంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే చంటి, ఫైమా పర్వాలేదనిపిస్తున్నారు. ఈ నలుగురు మినహా మిగతావాళ్లు వేస్ట్. ఎవరికి వారు తింటానికి.. పడుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినట్లు వాళ్ళ ఆట తీరుతుందని అంటున్నారు. హౌస్ లో ఇటువంటి వేస్ట్ కాండిట్ లను.. ముందుగానే పంపించేసి వైల్డ్ కార్డు రూపంలో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆడియన్స్ అంటున్నారు.