Big Boss 6 Telugu

Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఆ కంటెస్టెంట్ కి పులిహార కలిపేస్తున్న ఆర్జే సూర్య..!!

Share

Bigg Boss Season 6: తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో లలో లవ్ ట్రాక్ లు సర్వసాధారణం. గొడవలు మరియు గ్రూపులు ఎలా క్రియేట్ అవుతాయో కొంతమంది మధ్య లవ్ ట్రాక్ లు కూడా గత సీజన్ లలో నడిచాయి. అయితే హౌస్ లో వాళ్లంతా క్లోజ్ గానే కెమెరాలకు ప్రోజెక్ట్ అయిన.. బయటకు వచ్చాక మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రీతిగా సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Surya BB 6

ఆ తర్వాత సీజన్ ఫోర్ లో అఖిల్ ఇంకా మోనాల్.. మధ్య కూడా సంథింగ్ అన్నట్లు ప్రచారం జరిగింది. ఇక సీజన్ ఫోర్ కి వచ్చేసరికి షణ్ముక్… సిరి మధ్య యవ్వారం చాలా గట్టిగా ప్రొజెక్ట్ అయింది. వీరిద్దరూ బయటకు వచ్చాక బాగా నెగిటివిటీ కూడా ఎదురుకోవడం జరిగింది. అయితే గత సీజన్ లలో చాలావరకు మూడోవారమో.. నాలుగో వారమో బాండింగ్ కుదిరేది. కానీ సీజన్ సిక్స్ లో మాత్రం మొదటి రోజు ఎపిసోడ్ లోనే ఒక జంట రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే సూర్య.. మొదటి రోజు ఎపిసోడ్ లో కీర్తి కేశవ్ భట్ తో మాట్లాడిన విధానం వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న తరహాలో బయట టాక్ నడుస్తోంది.

Keerthi Bigg Boss 6

వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూస్తే..సూర్య.. కీర్తి వేసుకున్న వైట్ షర్ట్ చూసి సేమ్ ఇటువంటి షర్ట్ నా దగ్గర ఉంది.. అని కీర్తితో చెబుతాడు. దానికి కీర్తి మరి ఇప్పుడు వేసుకోవచ్చు కదా అని అంటది. సూర్య ఇప్పుడు కాదు రేపు వేసుకుంటాను. ఎవరైనా .. నా షర్ట్ చూసి ఇది కీర్తి షర్ట్ లాగా ఉంది అంటే అవును అని అంటాను. ఇంకేంటి పిచ్చి అని సూర్య అంటే అది నా ఫేవరెట్ పదమని కీర్తి చెప్పటంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్లు ప్రచారం స్టార్ట్ అయింది. మరి కీర్తి..సూర్య బాండింగ్ రానున్న రోజులో ఏ వైపు దారి తీస్తుందో చూడాలి.


Share

Related posts

Bigg Boss 6: ఆ అమ్మాయి వద్దని అంటున్నా… హౌస్ లో లవ్ ట్రాక్ కి జాకీ లేస్తున్న బిగ్ బాస్..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు సీరియస్..!

sekhar

Bigg Boss 6: రెండో వారం నామినేట్ అయిన సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చిన నాగార్జున..!!

sekhar