Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ దాదాపు క్లైమాక్స్ కి చేరుకుంది. 21 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం హౌస్ లో 9 మంది ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా ఉంటే ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్ జరుగుతుంది. హౌస్ మెట్స్ ఇంటి సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూస్తున్న హౌస్ మేట్స్ చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా తొమ్మిదో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన గీతూ.. ప్రజెంట్ ఫ్యామిలీ ఎపిసోడ్ లు చూస్తూ గుక్క పెట్టి ఏడుస్తోంది. ఆమె ఏడుస్తున్న వీడియో భర్త వికాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చాలా కలలు కంది. హౌస్ లోకి వెళ్ళకముందే వాళ్ళ మదర్ కి సారీ కొనిచ్చి వేసుకుని రమ్మని చెప్పింది. సడన్ ఎలిమినేషన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ థీమ్ లో వాళ్ళ మదర్ నీ హౌస్ లో చూడాలనుంది. సో ఎపిసోడ్ చూస్తున్నప్పుడు వాళ్ళ మదర్ నీ తలుచుకొని చాలా ఏడుస్తుంది. మేమంతా గీతూతో ఉన్నాం. మీరు కూడా ఉన్నారు అనుకుంటున్నాం.. అంటూ భర్త వికాస్ .. టీవీ ముందు ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తూ గీతూ.. ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. గీతూ ప్రారంభంలో చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరూ భావించారు.

కానీ వారాలు మారే కొద్ది.. బిగ్ బాస్.. ఇచ్చే టాస్కులకు విరుద్ధంగా గీతూ వ్యవహరిస్తూ వచ్చింది. చెత్త లూప్స్ వెతికి.. మరి తన గేమ్ డ్యామేజ్ చేసుకుంది. హౌస్ నుండి వెళ్ళిపోక ముందు వారాలలో ఓవర్ కాన్ఫిడెన్స్ మరి ఎక్కువ అవ్వటంతో పాటు సంచాలక్ గా రెండు టాస్కుల విషయంలో ఆమె వ్యవహరించిన తీరు చూసే ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. దీంతో తొమ్మిదో వారం నామినేషన్ లో ఉండటంతో దెబ్బకి ఎలిమినేట్ అయ్యేటట్లు ఆడియన్స్ వ్యవహరించారు. ఎన్నో కలలుకని గెలవాలని వచ్చిన గీతూ.. కనీసం టాప్ ఫైవ్ కి వెళ్లకముందే.. ఎలిమినేట్ కావటం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.