Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడో వారం సీన్ మొత్తం మారిపోయింది. గత ఆరువారాల ఆట తీరు ఒకలాగైతే. ఏడ వారంలో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన షాకులకి ఎవరికి వారు సెట్ రైట్ అయ్యారు. ఇదిలా ఉంటే హౌస్ లో మొదటి నుండి శ్రీహాన్ తనదైన శైలిలో గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరో పక్క ఫిజికల్ టాస్క్ లలో రెచ్చిపోతున్నాడు.
కానీ మధ్యలో ఇనాయాతో గొడవలు పెట్టుకోవడంతో పాటు నామినేషన్ టైంలో అతిగా రియాక్ట్ కావటం కొద్దిగా నెగిటివ్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో నాగార్జున చేత తిట్లు కూడా తిట్టించుకోవడం జరిగింది. అప్పటినుండి శ్రీహాన్ గేమ్ చాలా స్లో అయిపోయింది. అయితే ఏడో వారంలో బిగ్ బాస్ క్లాస్ పీకిన తర్వాత మళ్లీ శ్రీహాన్ రెచ్చిపోయాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గురువారం ఎపిసోడ్ లో “పూల టాస్క్” లో తన తోటి కంటెస్టెంట్ అర్జున్ ని గెంటేసి అవతల పడేసాడు. అర్జున్ కూడా గొడవకు దిగడం జరిగింది.
ఈ గొడవలో శ్రీహాన్ ఎక్కడ తగ్గలేదు. తొడగొట్టి మరీ దమ్ముంటే గేమ్ లో చూపించు అంటూ అర్జున్ పైన పెద్ద పెద్ద డైలాగులు వేయడం జరిగింది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధం సాగింది. తర్వాత ఇంటి సభ్యులంతా సెట్ రేట్ చేయటంతో ఎవరికి వారు సద్దుమణి గారు. ఆటలో మాత్రం రెచ్చిపోయారు. ఏది ఏమైనా చాలా స్లోగా ఉండే ఈ ఇద్దరు ఒక్కసారిగా.. గొడవ పడటం గురువారం ఎపిసోడ్ లో హైలెట్ గా మారింది.