21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: గత సీజన్ లో నటరాజ్ మాస్టర్… ఇప్పుడు రేవంత్ కి బిగ్ బాస్ బిగ్ సర్ ప్రయిజ్..!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక బయట ప్రపంచంతో ఇంటిలో ఉన్న సభ్యులకు కనెక్షన్ ఉండదన్న సంగతి తెలిసిందే. కనీసం ఫోన్ కూడా లోపలికి అనుమతులు ఉండవు. అంతేకాదు తిండికి కూడా అవస్థలు పడే పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఈ గేమ్ షోలో ఎదురయ్యే పరిస్థితులకు. బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది హౌస్ మేట్స్ కంటతడి పెడుతుంటారు. పెళ్లయిన వాళ్లు ఇంటిదగ్గర భార్యా పిల్లలు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా బ్యాచులర్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళు ఉంటాయి. కొత్తగా పెళ్లయింది భార్య గర్భవతి అయి ఇంటిదగ్గర ఉంటే.. వాళ్ల కష్టాలు మరో లెవెల్ లో ఉన్నాయి.

Last season Nataraj master is now bigg boss big surprise for Revanth
Bigg Boss 6

సరిగ్గా ఈ తరహాలోనే గత సీజన్ ఫైవ్ లో నటరాజ్ మాస్టర్ కి అనుభవం ఎదురయింది. భార్య గర్భవతి అయి ఇంటి దగ్గర ఉంది నటరాజ్ మాస్టర్ హౌస్ లో గేమ్ ఆడుతూ ఉన్నారు. కానీ ధ్యాస మొత్తం గర్భవతిగా ఉన్న భార్య మీదే. ఇక ఈ సీజన్ లో సింగర్ రేవంత్ కి కూడా ఇదే పరిస్థితి. కానీ బిగ్ బాస్ మాత్రం ఈ విషయంలో చాలా సానుకూలంగా ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని హౌస్ లో ఉన్న సభ్యులు తెలుసుకునే రీతిలో వీడియోలు చూపించడం విశేషం. గత సీజన్ ఫైవ్ లో నటరాజ్ మాస్టర్ భార్య శ్రీమంతానికి సంబంధించిన వీడియో ఆయనకు చూపించి ఇంటిదగ్గర భారీ ఆరోగ్యంగా ఉందని తెలియజేశారు. ఇక ఈ సీజన్ లో రేవంత్ కి గురువారం జరిగిన ఎపిసోడ్ లో తన భార్య.. క్షేమంగా ఉన్నట్లు సీమంతం జరిగిన వీడియోని ప్రదర్శించడం జరిగింది. తన భార్య సీమంతం వీడియో చూస్తూ రేవంత్ కన్నీరు పెట్టుకున్నాడు.

Last season Nataraj master is now bigg boss big surprise for Revanth
Bigg Boss 6

చాలా ఆరోగ్యంగా ఉంది అని వీడియోలో అర్థం అవుతుంది. థాంక్యూ బిగ్ బాస్ అంటూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో కప్పు కొట్టి తన బేబీకి ఇవ్వాలని రేవంత్ తనలో తాను మాట్లాడుకున్నాడు. ఊహించని రైతుల బిగ్ బాస్ నుండి ఈ సర్ప్రైజ్ రావడంతో రేవంత్ ఎంతగానో సంతోషించడం జరిగింది. ఇదే సంతోషాన్ని హౌస్ లో ఉన్న ఇతర ఇంటి సభ్యులతో కూడా స్వీట్స్ ఇచ్చి రేవంత్ మరింత సంతోషపడేలా బిగ్ బాస్ ఏర్పాటు చేయటం గురువారం ఎపిసోడ్ లో హైలెట్.


Share

Related posts

Bigg Boss 6: ఏడో వారంలో ఎవరు ఊహించని కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్..??

sekhar

Bigg Boss 6: బాస్ హౌస్ నుండి షాని ఔట్..??

sekhar

Bigg Boss 6: రెండో వారం కెప్టెన్సీ ఎన్నిక విషయంలో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ షాక్..??

sekhar