21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: నాలుగో వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు..?

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో వారం నామినేషన్ ప్రక్రియకి సంబంధించి లైవ్ కవరేజ్ బట్టి వస్తున్న సమాచారం మొత్తం పదిమంది నామినేట్ అయ్యారట. ఆల్రెడీ శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున… డైరెక్ట్ గా కీర్తి, అర్జున్ నీ నామినేట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో వీళ్ళిద్దరితో పాటు సుదీప, కీర్తి, గీతు, రేవంత్, రాజ్, ఇనయా, శ్రీ హన్, అర్జున్, సూర్య, ఆరోహీ నామినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సీజన్ సిక్స్ లో మొత్తం 20 మంది హౌస్ లో అడుగుపెట్టడం జరిగింది.

The Official List of Bigg Boss 6 Telugu Contestants

మొదటివారం నో ఎలిమినేషన్ కావటంతో రెండో వారంలో షానీ, అభినయశ్రీ డబల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో మూడో వారం నేహా హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో 17 మంది ఉండగా ఈ వారం పదిమంది నామినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ గా మారింది.

Members in nomination for the fourth week
Bigg Boss 6

ఇక జరిగిన నామినేషన్ ప్రక్రియ లో చాలావరకు ఇనాయనీ టార్గెట్ చేసినట్లు సమాచారం. మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో భారీ ఎత్తున ఇనాయకి మిగతా కుటుంబ సభ్యులకి మధ్య గొడవలు జరిగాయి. రేవంత్, శ్రీహాన్ తో నువ్వా నేనా అన్నట్టుగా ఇనాయ వ్యవహరించింది. దీంతో నాలుగో వారం నామినేషన్ లో ఇనాయకి చాలా ఓట్లు పడినట్లు సమాచారం. ఇనాయ చాలా ఫైర్ మీద గేమ్ ఆడుతూ ఉండటంతో.. ఆమె ఓటింగ్ గ్రాఫ్ ఉన్నా కొద్ది పెరుగుతుంది. దాదాపు మొదటి వారంలోనే ఇనాయ.. వెళ్ళిపోతుందని అందరూ భావించారు. కానీ నో ఎలిమినేషన్ అని ప్రకటించడంతో బతికిపోయింది.


Share

Related posts

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారంలో నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే..?

sekhar

Bigg Boss 6: రెండో వారం కెప్టెన్సీ ఎన్నిక విషయంలో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ షాక్..??

sekhar

Bigg Boss 6: హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన చలాకి చంటి..!

sekhar