25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: గీతుకి వందకి రెండు వందల మార్కులు ఇచ్చిన నాగార్జున..!! Nagarjuna praises geetu game in bigg boss 6

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండవ వారంలో గీతు రాయల్ అద్భుతమైన ఆట తీరుతో దూసుకుపోవటం తెలిసిందే. ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి గీతు తన గేమ్ స్టార్ట్ చేసేసింది. స్టార్టింగ్ లోనే సుల్తానా నీ టార్గెట్ చేసుకుని గేమ్ ఆడిన గీతు.. మొదటి వారంలో వరస్ట్ పర్ఫార్మర్ గా జైల్లోకి వెళ్లిన గాని రెండోవారం బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్ గా నాగార్జున చేత శభాష్ అనిపించుకుంది. రెండవ వారంలో ఇంటి సభ్యుల ఆట తీరకు మార్కులు వేస్తూ..గీతుకి వందకి రెండు వందలు మార్కులు వేస్తున్నట్లు నాగార్జున పొగడ్తలతో ముంచెత్తారు.

Nagarjuna praises geetu game in bigg boss 6
Bigg Boss 6

ఈ సందర్భంగా గీతు.. కేవలం మీరు గేమ్ లో 20 శాతం మాత్రమే చూశారు సార్. రాబోయే రోజుల్లో భయంకరంగా ఆడతాను సార్ అని తెలియజేసింది. అయితే మరి అంత భయంకరంగా ఆడే దానివైతే నీ బొమ్మ ఎందుకు పోయిందమ్మా..? అంటూ నాగార్జున సెటైర్ వేశారు. ప్రేమికు లొంగీపోవాల్సి వచ్చింది సార్..అంటూ గీతు చెప్పుకొచ్చింది. ఇక రాబోయే రోజుల్లో బాగా ఆడాలని.. మిగతా 80% గేమ్ చూడటానికి నాతో పాటు ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారని నాగార్జున..గీతు నీ పొగడటం జరిగింది.

Nagarjuna praises geetu game in bigg boss 6
Bigg Boss 6

సిసింద్రీ టాస్క్ లో గీతు.. తన బొమ్మను ఎవరు దొంగలించకుండా స్టోర్ రూమ్ లో.. దాచేసి మిగతా ఇంటి సభ్యులను ముప్పు తిప్పలు పెట్టింది. రేవంత్ టాస్క్ ఓడిపోయిన సమయంలో  బొమ్మ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రమంలో చాకచక్యంగా గీతు..రేవంత్ బొమ్మ దోచేయటం రెండో వారం కెప్టెన్సీ టాస్క్ లో గేమ్ చేంజ్ చేసినట్లయింది. హౌస్ లో ఏకంగా నలుగురు బొమ్మలను దొంగిలించి కెప్టెన్సీ కాకుండా అడ్డుకుంది. తన బొమ్మ పోయినా గాని మిగతా వారి బొమ్మలను దోచుకోవడానికి గీతు వ్యవహరించిన తీరు హైలెట్ అయింది.


Share

Related posts

Bigg Boss 6: ఈ వారం మధ్యలో తెలుగు బిగ్ బాస్ షోలో ఏ సీజన్ లో జరగని ఉహించని సరికొత్త ట్విస్ట్ ..?

sekhar

Bigg Boss 6: అనుకున్నట్టుగానే ఎనిమిదో వారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయినా శ్రీహాన్..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్లాప్ అంటూ గీతూ రాయాల్ సంచలన కామెంట్స్..!!

sekhar