Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో వారం వీకెండ్ ఎపిసోడ్ చాలా రసవతారంగా సాగింది. బుధవారం కొత్త కెప్టెన్ ఆదిరెడ్డిని నాగార్జున అభినందించారు. ఇంక హౌస్ లో జరిగిన గొడవలు గురించి పలువురికి చివాట్లు మరి కొంతమందికి అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా “అడవిలో దొంగలు” టాస్క్ సమయంలో.. నేహా చౌదరి వ్యవహరించిన తీరు.. వీడియో రూపంలో గుట్టు.. రట్టు చేశారు. ఇనాయా తనని చంప మీద కొట్టినట్లు పెద్ద రాధాంతం చేయటం జరిగింది. ఆ విషయం గురించి మాట్లాడితే అవును సార్ …ఇనాయా నన్ను చంప మీద కొట్టింది అంటూ నేహా మళ్లీ అదే మాటలపై ఉంది.

దీంతో ఆ సమయంలో జరిగిన వీడియో నాగార్జున బయట పెట్టరు. ఆ వీడియోలో అసలు ఇనాయా.. నేహా చెంపపై చెయ్యి కూడా చేసుకోలేదు. దీంతో వెంటనే నేహ చౌదరి నాలుక కరుచుకుని.. పొరపాటు అయిందని సారీ చెప్పింది. అనంతరం లగేజ్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో రాత్రులు దొంగతనాలకు పాల్పడుతూ రొమాంటిక్ గా హగ్గులు, కిస్సులు.. ఇచ్చుకుంటున్న సూర్య, ఆరోహికి సంబంధించి.. అడవిలో దొంగలు టాస్క్ సమయంలో ఇద్దరు రొమాంటిక్ గా దిగిన ఫోటో బయట పెట్టడం జరిగింది.

సూర్య, ఆరోహి ఫోటో చూసి ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా షాక్కుతున్నారు. హౌస్ లో ఇన్ని జరుగుతున్నాయా అంటూ ఎవరికి వారు ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేశారు. కిచెన్ లో వంటలు చేసుకోవటం ఇంకా మెరీనా.. రోహిత్ కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ దొంగలించడం వంటి వాటిపై మూడో వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ప్రస్తావించి సూర్య, ఆరోహి… గాలి తీసేశారు. ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్న సమయంలో..ఫైమా చేతితో బ్రిక్స్ సర్దటం అదే సమయంలో రేవంత్ చెప్పటం వీడియో బయటపెట్టి క్లారిటీ ఇవ్వటం జరిగింది. సంచాలకుడిగా రేవంత్ తీసుకుని నిర్ణయం.. కరెక్ట్ అని నాగార్జున తెలియజేశారు.