బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4వ తారీఖు నుండి ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. గత ఐదు సీజన్లలో చాలావరకు గేమ్ ఒకే ఫార్మేట్ లో సాగింది. ఫిజికల్ టాస్కులు ఇంకా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు సైతం చాలావరకు రిపీట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క వైల్డ్ కార్డులు విషయంలో కొన్ని సీజన్లలో కొంతమంది ఎంట్రీ ఇవ్వగా గత సీజన్లలో ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. కానీ రియంట్రీలు మాత్రం ఉన్నాయి. ఇదిలా ఉంటే సీజన్ 6లో గత సీజన్లకు భిన్నంగా పూర్తిగా రూల్స్ షో నిర్వాహకులు మార్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే సోమవారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కానున్న క్రమంలో దానిని బుధవారానికి మార్చినట్లు ఇప్పటికే వార్తలు రావడం జరిగింది. ఇక వీటితో పాటు.. ఇంటి సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఇచ్చే పనిష్మెంట్ విషయంలో ఈసారి కొత్త రూల్స్ ఇంటిలో అమలు చేయనున్నట్లు సమాచారం. పోటీ పడే ఇంటి సభ్యుల కోసం ఈ సీజన్ లో కొత్త టాస్కులు .. మరింత కఠినంగా చూసే ప్రేక్షకులకు ఉత్కంఠ భరితంగా ఉండే విధంగా ప్లాన్ చేసినట్లు టాక్.
సెప్టెంబర్ నాలుగు వచ్చే ఆదివారం నుండి.. ప్రసారం కానున్న ఈ షో దాదాపు 100 రోజులపాటు సాగనుంది. మొత్తం 19 మంది పోటీ పడుతున్నట్లు వినికిడి. అయితే ముందుగా 15 మంది సభ్యులను హౌస్ లోకి పంపించాలని మిగతా నలుగురిని వైల్డ్ కార్డు రూపంలో పంపించే ప్లాన్ షో నిర్వాహకులు వేసినట్లు సమాచారం. ఇక యధావిధిగా ఈసారి ఆరో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తూ ఉండటంతో తెలుగు బిగ్ బాస్ షోకి వరుసగా నాలుగోసారి యాంకర్ గా చేస్తున్నట్లయింది.