Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 మూడో వారం నామినేషన్ లో శ్రీహాన్ ఉండటం తెలిసిందే. దీంతో సిరి తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కి ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రంగంలోకి దిగింది. సీజన్ ఫైవ్ లో సిరి ఆడటం తెలిసిందే. టాప్ ఫైవ్ లో సిరి స్థానం సంపాదించుకోంది. దీంతో ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ప్రస్తుత సీజన్ గేమ్ ఆడుతూ ఉండటంతో.. హెల్ప్ చేస్తూ ఉంది. సిరి సీజన్ ఫైవ్ లో గేమ్ ఆడుతున్న సమయంలో.. ఆమె నామినేషన్ లో ఉన్న ప్రతిసారి శ్రీహాన్ .. ఓట్లు వేయించేవాడు.

ఇప్పుడు సిరి వంతు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీహాన్ ఆడుతున్న ఆట తీరు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీహాన్ బయట పెద్దగా ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. చాలా తక్కువ మందితో కలుస్తూ ఉంటాడు. అసలు హౌస్ లో ఎవరితో కలవడు అని నేను అనుకున్నాను. కానీ అందరితో బానే కనెక్ట్ అయిపోయాడు. డాన్స్ రాదంటూనే హౌస్ లో బాగా డాన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీహాన్ నామినేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు మన టైం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఓటు వేయండి అని సిరి.. రిక్వెస్ట్ చేయడం జరిగింది.

ఒకపక్క షూటింగ్ చూసుకుంటూనే మరోపక్క శ్రీహాన్ గెలిపించుకోవడం కోసం ఆరాటపడుతున్నట్లు తెలిపింది. ఫస్ట్ టైం శ్రీహాన్ కి ఓట్లు వేసిన సమయంలో చాలా వెరైటీగా ఉంది. ఆ ఫీల్ చాలా బాగా నచ్చింది. సీజన్ ఫైవ్ లో నన్ను ఎలా అయితే చివరి వరకు సపోర్ట్ చేశారో… అదేవిధంగా శ్రీహన్ కి సపోర్ట్ చేయండి అంటూ సిరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. హాట్ స్టార్ లో 10 ఓట్లు ఇంక మిస్డ్ కాల్ ద్వారా కూడా ఓట్లు వేయండి అని సూచించింది.