Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో వారం ఆట ముగిసిపోయింది. నామినేషన్ లో పది మంది ఉన్నారు. ఎవరు హౌస్ నుండి వెళ్తారు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే అందరికంటే చివరిలో ఆరోహి ఉండడం జరిగిందంట. దీంతో ఆదివారం ఎపిసోడ్ లో హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన నాటినుండి ఆరోహి ఇంకా సుదీప చివరి స్థానంలో ఉంటూ వస్తున్నారు. శుక్రవారం పోల్ ముగిసే సమయానికి.. ఆరోహి చివరిలో ఉన్నట్లు.. దీంతో ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నట్లు సోషల్ మీడియాలో లీక్ వార్తలు వస్తున్నాయి.

మొదటి నుండి హౌస్ లో ఆరోహి అతిగా స్పందించడం మినహా పెద్దగా గేమ్ ఆడిన సందర్భాలు లేవు. ప్రతి దానికి ఎట్టకారంగా మాట్లాడటంతో పాటు ఎక్కువగా సూర్యతో అనవసరమైన ముచ్చట్లు పెట్టడం జరిగిందని మొదటినుండి ఆరోహి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. సూర్యతో నైట్ మీటింగ్ లు.. కారణం లేని విషయాలకు గొడవలు పడటం మొత్తం చూస్తే ఆరోహి కంటెంట్ ఇవ్వడానికే హౌస్ లో ఆ రకంగా వ్యవహరిస్తుందని.. మొదటి నుండి గట్టి టాక్ నడుస్తుంది.

ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఆరోహి ఇప్పటిదాకా పెద్దగా ఆడిన సందర్భాలు లేవని అంటున్నారు. దీంతో నాలుగో వారం ఓటింగ్ ప్రక్రియలో చివరి స్థానంలో నిలిచి హౌస్ నుండి.. ఆరోహి ఎలిమినేట్ అవుతున్నట్లు.. ఎప్పటిలాగా ముందుగానే సోషల్ మీడియాలో లీక్ వార్తలు వచ్చేసాయి. ఆరోహి ఎలిమినేట్ అయితే కచ్చితంగా సూర్య గేమ్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయని జనాలంటున్నారు.