Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమై రెండు వారాలు గడిచిపోయింది. ఇప్పటికే హౌస్ లో ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారంలో ఎలిమినేషన్ అని ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ రెండో వారంలో డబల్ నామినేషన్ అని షాక్ ఇచ్చి ఇద్దరిని.. హౌస్ నుండి పంపించేయడం తెలిసిందే. అయితే మూడో వారంకి సంబంధించి సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో 9 మంది నామినేట్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే గీతూ రాయల్, రేవంత్, వాసంతి, ఆదిత్య, చంటి, ఆరోహి, నేహా, సుల్తానా, శ్రీహాన్.

ఈ తొమ్మిది మందిలో గీతు రాయల్ అదేవిధంగా ఆదిత్య కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. మూడవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ వాడి వేడిగా జరిగింది. ఎవరికి వారు తమ కారణాలు చెబుతూ.. నామినేషన్ చేసే వారిపై గొడవకు దిగినట్టుగా మాట్లాడారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో గీతు వర్సెస్ సుల్తానా మధ్య జరిగిన గొడవ … హౌస్ లో నామినేషన్ లలో జరిగిన అన్ని గొడవలు కంటే అతి పెద్ద గొడవగా నిలిచింది. రెండోవారం వీకెండ్ టైములో హౌస్ లో ఎవరు కూడా గేమ్ ఆడటం లేదని నాగార్జున గట్టిగానే బుద్ధి చెప్పారు.

దీంతో మూడో వారంలో మాత్రం ఇంటి సభ్యులంతా.. నామినేషన్ టైం నుండే రెచ్చిపోయారు. గతవారం డబల్ నామినేషన్ కావడంతో ప్రస్తుతం హౌస్ లో 18 మంది ఉన్నారు. ఇక మూడోవారానికి సంబంధించి 9 మంది నామినేట్ కావటంతో.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో మూడో వారం… ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ విషయంలో ఓటింగ్ గట్టిగానే జరుగుద్దని ఆడియన్స్ అంటున్నారు.