Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి రెండు వారాలు ఆటగా కంప్లీట్ కాగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అభినయశ్రీ, షానీ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక మూడో వారం హౌస్ నుండి ఎలిమెంట్ అవడానికి 10 మంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్ లో ఉన్న పదిమంది చాలా స్ట్రాంగ్ కంస్తాంట్ లే. దీంతో హౌస్ నుండి ఎవరు మూడో వారం ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

పోలీసులు వర్సెస్ దొంగలుగా ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా బిగ్ బాస్ విభజించారు. అయితే దొంగల టీంలో ఐకమత్యం లేకపోవడంతో వాళ్లలో వాళ్లకే బుధవారం ఎపిసోడ్ లో గొడవలు జరిగాయి. మరోపక్క పోలీస్ టీం చాలా స్ట్రాంగ్ గా అందరూ కలిసికట్టుగా ఆడుతున్నారు. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ లైవ్ లో మూడో వారం కెప్టెన్సీ పోటీ దారులుగా ఇద్దరిని బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరంటే.. పోలీస్ టీంకి చెందిన శ్రీ సత్య ఇంకా వ్యాపారస్తురాలు గీతు.

శ్రీ సత్య దగ్గర గోల్డెన్ గుడ్డు ఉండటంతో… ఆమెను కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించారు. గీత దగ్గర చెప్పిన అమౌంట్ తో పాటు బొమ్మలు కూడా ఉండటంతో.. మొదటి కెప్టెన్సీ పోటీదారుడుగా గీతుని బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. ఈ ఇద్దరు మాత్రమే కాదు మరి కొంతమంది కెప్టెన్సీ పోటీదారులు కూడా కానున్నట్లు బిగ్ బాస్ తెలిపారు. దాదాపు 5 గురువారం కెప్టెన్సీ పోటీదారుల బరిలో పోటీ పడనున్నట్లు బిగ్ బాస్ లైవ్ ఆడియన్స్ ద్వారా అందుతున్న సమాచారం.