Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికీ ఆరు సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. ఆరో సీజన్ కి గత ఆదివారం ఎండ్ కార్డ్ పడింది. ఇదిలా ఉంటే దాదాపు వరుసగా నాలుగు సీజన్ లకి నాగార్జున హోస్ట్ గా చేయటం తెలిసిందే. మూడో సీజన్ నుండి ఎంట్రీ ఇచ్చిన నాగ్ … లాస్ట్ సీజన్ వరకు చేయడం జరిగింది. అయితే ప్రేక్షకుల ఓటింగ్ పరంగా కాకుండా సీజన్ సిక్స్ లో పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వటంతో…బీబీ టీంపై నాగ్ సీరియస్ అయ్యారు అని టాక్. ఇదే సమయంలో … ఇదే తన లాస్ట్ సీజన్ అని కూడా తేల్చి చెప్పారట.

ముఖ్యంగా ఇనాయ ఎలిమినేషన్ విషయంలో కుట్రలు జరగడంతో… హౌస్ లో ఒక వ్యక్తిని కాపాడటం కోసం రాజకీయ నాయకులు.. కలుగజేసుకోవటం షో నిర్వాహకులు కాంప్రమైజ్ కావడంతో నాగ్ షో నుండి తప్పుకోవడం జరిగిందంట. ఈ క్రమంలో నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ గా ఇద్దరి పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. వాళ్లు మరెవరో కాదు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా. వీరిద్దరిలో ఒకరు కన్ఫామ్ అని అంటున్నారు. దాదాపు 99% రానా ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో “నెంబర్ వన్ యారి” అనే టాకీ షో నిర్వహించారు. చాలామంది సెలబ్రిటీలు ఈ షోకి రావడం జరిగింది. హోస్టింగ్ గా రానా అద్భుతంగా చేశారు. అయితే ఇప్పుడు ఏడో సీజన్ కి రానా రానున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో విజయ్ దేవరకొండ పేరు కూడా వినపడుతూ ఉంది. మరోపక్క సీనియర్ హీరో బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తూ ఉంది. కానీ ఎక్కువగా మాత్రం రానా ఓకే అయినట్లు ప్రస్తుతం గట్టిగా ప్రచారం జరుగుతుంది. 2017లో తెలుగులో బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది. మొట్టమొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ .. సెకండ్ సీజన్ కి నాని హోస్ట్. ఆ తర్వాత మిగతా అన్ని సీజన్ లకి నాగార్జున చేశారు. నెక్స్ట్ సీజన్ కి మాత్రం మరో కొత్త హోస్ట్ రానున్నట్లు సమాచారం.