Bigg Boss 6: మూడో వారం బిగ్ బాస్ సీజన్ 6 కెప్టెన్సీ పోటీ దారులలో గీతు రాయల్, ఫైమా, శ్రీ సత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్ మొదట సెలెక్ట్ అయ్యారు. “దొంగ పోలీసులు” టాస్క్ లో .. పోలీస్ టీం నుండి బాగా ఆడిన కంటెస్టెంట్ గా ఆదిరెడ్డి, ఫైమా సెలెక్ట్ కావడం జరిగింది. ఓడిపోయిన దొంగలు టీం నుండి శ్రీహాన్ ఒక్కడే సెలక్ట్ అయ్యాడు. అయితే బంగారపు గుడ్డు శ్రీ సత్య దగ్గర ఉండటంతో నేరుగా కెప్టెన్సీ పోటీదారురాలుగా సెలెక్ట్ అయింది.

బిగ్ బాస్ చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బులు గీతు దగ్గర ఉండటంతో ఆమె కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఈ ఐదుగురికి బ్రిక్స్ పిరమిడ్ గేమ్ నిర్వహించారు. ఈ గేమ్ లో సంచాలకుడిగా రేవంత్ ఉండటం జరిగింది. అయితే బ్రిక్స్ తీసుకొచ్చే విషయంలో గీతు రాయల్.. రూల్స్ తప్పడంతో ఫస్ట్ ఆమెను అనర్హురాలిగా తేల్చాడు. ఆ తర్వాత బ్రిక్స్ కాపాడుకునే విషయంలో .. చేతితో ముట్టుకుందని ఫైమానీ కూడా అనర్హురాలిగా తేల్చడం జరిగింది. ఇంకా మూడోవారం కెప్టెన్సీ రేసులో ఎపిసోడ్ ముగిసే సమయానికి ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య మాత్రమే మిగిలి ఉన్నారు.

వీరిలో కెప్టెన్ ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. “దొంగ పోలీసుల” గేమ్ లో దొంగల టీంలో .. ఎవరి దగ్గర ఐకమత్యం లేకపోవడంతో.. నిజమైన వెంటనే ఎవరికి వారు గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకున్నారు. కానీ పోలీసుల టీం అంతా ఐక్యమత్యంగా కలిసి ఆడటంతో.. గెలుపు సాధించి విజయాన్ని అందరూ పంచుకున్నారు. ఏది ఏమైనా మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో భారీ ఎత్తున గొడవలు, అరుపులు, కేకలతో… ఇంటిలో ఉన్న ప్రతి సభ్యుడు గేమ్ ఆడటం జరిగింది.