NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Lockdown : కోవిడ్ లాక్ డౌన్ విధించి సరిగ్గా ఏడాది…! మళ్లీ అదే కథ రిపీట్?

Lock Down ; Any chances to Lock Down again.!?

Lockdown : సరిగ్గా ఏడాది క్రితం భారతదేశం తొలిసారి కోవిడ్ ఉనికిని చవిచూసింది. అప్పటి నుండి ఈ రోజు వరకు దాని ప్రభావం అందరి పై పడింది. ఒక మూడు నెలల నుండి కొద్దిగా ఉపశమనం లభించగానే మళ్లీ మార్చి నెల వచ్చేసరికి పరిస్థితి మునుపటి మార్చి లాగే తయారవుతోంది.

 

1 year of covid Lockdown
1 year of covid Lockdown

కరోనా నింపిన చీకటిఇచ్చిన తెలివి

కరోనా మహమ్మారికి చెక్ చెప్పడానికి లాక్ డౌన్ ను మించి వేరే మార్గం లేదని కేంద్రం గత సంవత్సరం మార్చి 23 వ తేదీన ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు ఒక రోజు ముందే సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. అప్పుడు మొదలైన వైరస్ ప్రభావం భారత్ పై పెను ప్రభావం చూపింది. ఎన్నో జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. రోడ్డు పై పడిన వలస కార్మికులు…. కుటుంబాలకు ఈ లోకాలకి దూరమైన ఎంతో మంది పోలీసులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్పూర్తిగా చీకటి నిండిన బడుగు బలహీన జీవుల ఇళ్ళు…. ఇలా లాక్ డౌన్ అందరికీ జీవితంలో మర్చిపోలేని ఎన్నో పాఠాలు నేర్పింది. ఎవరైనా ప్రకృతి ముందు ఒకటే అని చాటి చెప్పింది.

Lockdown : అప్పుడెలా?

ఇక లాక్డౌన్ ముందు దేశంలో కరోనా వైరస్ పునరుత్పత్తి 1.7 గా ఉంటే లాక్ డౌన్ తర్వాత 1.2 కి తగ్గింది. మార్చిలో మొదలైన కేసులు పరంపర ఆగస్టు నాటికి తీవ్ర స్థాయికి చేరుకొని నవంబర్డిసెంబర్ కి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. అయితే ఆ మధ్యలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేశ ఆర్థికవ్యవస్థ దాదాపు పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటిదేమీ లేదని కేంద్రం బుకాయిస్తున్నప్పటికీ ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రం ఖచ్చితమైన లెక్కలు చెబుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు కేవలం శాంపిల్. లోలోపలి నష్టం అంచనా వేయడానికి మన శక్తి సరిపోదు అని చెప్పాలి.

ఇప్పుడిలా….

ఇక సరిగ్గా ఏడాది దాటిన తర్వాత దేశంలో మళ్లీ కరోనా ఊపందుకుంది. కేరళ, మహారాష్ట్ర లో భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతుంటే వారు లాక్ డౌన్ ను విధించారు. స్కూలు. హాస్టళ్ళ మూసివేత పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక తెలంగాణలో కూడా వీకెండ్స్ కంప్లీట్ లాక్ డౌన్ వేసే దిశగా కేసీఆర్ ఆలోచిన్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇలా వీకెండ్ లాక్ డౌన్ విధించగా మరికొన్ని చోట్ల కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ సాధ్యపడకపోవచ్చు కానీ మళ్ళీ మార్చి నెల నుండి ప్రజలకు గడ్డుకాలం మొదలుకానుంది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju