NewsOrbit
Featured బిగ్ స్టోరీ

5 States Elections Results: ఈ ఫలితాలతో బీజేపీ ఓడినట్టా..!? బలపడినట్టా..!? “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

5 States Elections Results: Did BJP Lost or Gain Their Votes..?

5 States Elections Results: అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడింది.. బెంగాల్ లో ఓడిపోయింది.. కేరళలో ఏ మాత్రం ప్రభావం చూపలేదు.. తమిళనాడులో ఒక్కరే గెలిచారు.. పుదుచ్చేరి, అస్సాం లో పెద్దగా పుంజుకోలేదు..! బీజేపీ ఓడింది. బీజేపీ ఓడిపోయినట్టే..! అనే అభిప్రాయంతోనే ఉన్న వారికి కొంచెం లోతైన అంశాలు పరిశీలించాల్సి ఉంది. ఆ రాష్ట్రాల్లో.. ఆ అసెంబ్లీల్లో బీజేపీ గత బలం.., ప్రస్తుత బలం చూసుకుంటే.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలను సరిపోల్చుకుంటే మొత్తం మీద బీజేపీ ఓడినట్టా..? బలపడినట్టా..!? అనేది తెలుసుకోవచ్చు..!

5 States Elections Results: Did BJP Lost or Gain Their Votes..?
5 States Elections Results Did BJP Lost or Gain Their Votes

5 States Elections Results: బెంగాల్ లో 3 నుండి 80 లోకి..!!

బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండేది కాదు. 2011 వరకు ఆ పార్టీ ఉనికి కూడా పశ్చిమ బెంగాల్ లో లేదు. అటువంటి రాష్ట్రంలో 2016 ఎన్నికల్లో మూడు అసెంబ్లీలు గెలుచుకున్న బీజేపీ.., 2021 లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో 80 స్థానాలకు పైగా గెలుచుకుంటుంది. మొత్తం మీద బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం బాగా పెరిగినట్టు. అయితే ఇక్కడో చిన్నపాటి చిక్కు ఉంది. 2019 లో వచ్చిన లోక్ సభ ఓట్లతో పోలిస్తే బీజేపీకి ఈ సారి తక్కువే కదా అనే అనుమానాలు రావచ్చు..
* 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి ఆ రాష్ట్రంలో 18 ఎంపీ స్థానాలొచ్చాయి. దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా దాదాపు 36 శాతం ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్ సభ ఎన్నికలు వేరుగా భావించాలి..! సో.. కచ్చితంగా బీజేపీకి గత ఎన్నికల కంటే 30 శాతం అధికంగా ఓట్లు వచ్చినట్టే. సున్నా నుండి మూడు.. మూడు నుండి 80 లకు చేరుకుంది. అయితే బీజేపీ ఇక్కడ పూర్తిగా దృష్టి పెట్టింది. బలం, బలగం మొత్తం ప్రయోగించింది. ఆ ఫలితమే మూడు నుండి 80 కి ప్రయాణం.

5 States Elections Results: Did BJP Lost or Gain Their Votes..?
5 States Elections Results Did BJP Lost or Gain Their Votes

తమిళనాడులో ప్రభావం బాగానే..!!

తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి గెలుపు అసాధ్యమే. తమిళ ఎన్నికల్లో ఈ నాడూ జాతీయ పార్టీలు గెలుచుకున్నది లేదు. అక్కడ కేవలం ద్రవిడ పార్టీలది మాత్రమే పై చేయి. అటువంటి రాష్ట్రంలో అన్నా డీఎంకే తో జతకట్టి బీజేపీ ప్రభావం బాగానే చూపించినట్టు చెప్పుకోవచ్చు. స్టాలిన్ గాలి బలంగా వీస్తున్న వేళ.. డీఎంకే కి ఏకపక్షంగా గెలుపు సులువే అనుకున్న చోట.. జయలలిత లేక తలాతోకా కోల్పోయిన అన్నా డీఎంకే ఈ ఎన్నికల్లో 90 స్థానాలు దరిదాపులకు వచ్చింది అంటే అది బీజేపీ చలవే. అక్కడ కమలానికి ఓట్లు పడవు. కానీ కమలం అర్ధ, అంగ, స్ట్రాటజీకల్ మద్దతుతో అన్నా డీఎంకే కొంత లబ్ది పొందినట్టు చెప్పుకోవచ్చు.

* కేరళ ఎన్నికల్లో కూడా బీజేపీ మొదటి నుండి లేదు. ఇప్పుడిప్పుడే విత్తనాలు నాటుకుంటుంది. 2016 ఎన్నికల్లో మొదటి సారి కేరళ ఎన్నికల్లో బీజేపీ జనంలోకి తెలిసింది. ఒక్క స్థానం గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఆధిక్యత ఉంది. గెలిచినా, గెలవకపోయినా పేద ప్రభావం ఏమి లేదు.. అస్సాం, పుదుచ్చేరిలో కూడా బీజేపీకి గతంలో ఉన్న పరిస్థితి మేరకు బీజేపీకి ఓట్లు/సీట్లు ఉన్నట్టు చెప్పుకోవచ్చు.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju