NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఆమె మనసు చల్ల”నిధి”..! దానం అరుదైనది..! అమ్మలకే స్ఫూర్తినిచ్చిన అమ్మ కథ..!!

 

 

అమ్మపాలు.. అమృతమూ అనే పోలిక కాదు కానీ..! అమృతం మనకు దూరం. ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, దేవతలు ఎన్నిసార్లు తాగుతారో కూడా తెలియదు…! ఆ దేవతలకు అమృతం ఇచ్చే ఆయుష్షు, బలం  దిట్టుగా తల్లిపాలు ఉంటాయి. పసివయసులో తాగే తల్లి పాల ప్రభావం ఆ బిడ్డకు జీవితాంతం ఉంటుంది..!! అటువంటి అమ్మపాలు దానం చేసి ఓ మహిళ “పరిపూర్ణ అమ్మ”గా మారింది. లీటర్ల కొద్దీ పాలను ఒక పాల బ్యాంకుకు దానం చేసిన మహిళా గురించి మనము తెలుసుకోవాల్సిందే..!

 

Saand Ki Aankh producer Nidhi Parmar Hiranandani

శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. నాణ్యమైన ప్రోటీన్లు అంది మెదడు వికసిస్తుంది. ఈ పాలల్లో బిడ్డకు అవసరమయ్యే ప్రోటీన్స్ అందుతాయి. తల్లిపాల ద్వారా బిడ్డలకు డయేరియా,నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడొచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న చనుబాలు తమ పిల్లలకి ఇవ్వడానికి కొంత మంది తల్లులు ఎక్కువగా ఇష్టపడడం లేదు. కొంత మంది కి ఏమో చనుబాలు వృద్ధి లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ… “నిధి పర్మార్ హిరానందాని” అనే 42 సంవత్సరాల మహిళ తన చనుబాలను దానం చేసింది. కొన్ని పరిస్థితుల వలన తల్లి, పుట్టిన బిడ్డ కు దూరం అవుతుంది. ఇలాంటి పసికందుల కోసం 40 లీటర్ల తన చనుబాలని దానం చేసింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ సమయం లో తల్లిపాలను దానం చేసి తలులకి దూరం అయినా అనేక చిన్నపిల్లల ప్రాణాలు కాపాడారు.

 

nidhi donates breast milk

అవసరం కంటే ఎక్కువ ఉన్నాయని..!!

ఈ ఏడాది ఫిబ్రవరిలో పసికందు వీర్ కు జన్మనిచ్చింది నిధి, తన బిడ్డకు అవసరం అయిన పాలను ఆహారంగా ఇచ్చాక కూడా, తన చనుబాలు ఇంకా మిగిలి ఉండడం ఆమె గ్రహించారు. దీనితో ఆమె ఆ రొమ్ము పాలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసారు. ఓ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ “అధిక తల్లి పాలను కలిగి ఉన్నవిషయాన్ని గ్రహించాక, వాటిని వృధా చేయకూడదు అన్ని నిర్ణయించుకున్నాను. రొమ్ము పాలు రిఫ్రిజిరేటర్‌లో సరిగ్గా నిల్వ చేస్తే మూడు నుంచి నాలుగు నెలల షెల్ఫ్ లైఫ్ ఉంటుందని ఇంటర్నెట్‌లో చదివి తెలుసుకున్నాను. అయితే ఇంటర్నెట్ లో తల్లి పాలతో ఫేస్ ప్యాక్‌లు, స్కరుబ్స్ వంటివి చేయవచ్చు అన్ని చూపించింది. కాని ఆలా వృధా చేయడం ఇష్టం లేక, తల్లిపాలను దానం ఎలా చేయాలో తెలుసుకున్నాను” అన్ని ఆమె తెలిపారు. ఆ తరువాత బాంద్రాలోని ఉమెన్స్ హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, ఆ పాలను సూర్య ఆసుపత్రికి దానం చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అప్పటికే తన ఫ్రిడ్జ్ లో దాచిన పాలను ఆ ఆసుపత్రి పాల బ్యాంకు కు దానం చేసినట్లు ఆమె తెలిపారు.

 

breast milk storage banks

ఇటువంటి దానం అరుదు.. అవసరం..!!

దేశంలోని 3 నుండి 10 వయసున్న బాలల్లో రక్తహీనత, పోషకాహార లోపాలున్న వారు కనీసం 22 శాతం ఉన్నారని ఒక అంచనా. ఈ రోగాలకు మూల కారణం పసితనంలో తల్లిపాలను ఇవ్వకపోవడమే. అందుకే పాలు రాని, ఉత్పత్తి లేని తల్లుల.. వారి పిల్లలకు ఈ నిధి లో పాలు దానం చేయడం అవసరం. పుట్టిన దగ్గర నుండి కనీసం 6 నెలలు అయినా పిల్లలకి తల్లి పాలు అందడం చాల అవసరం అని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే కొంత మంది తల్లులు బిడ్డలకి దూరం అవ్వుతుండగా, మరికొంత మంది కొన్ని అపోహలతో తమ పిల్లలకి కూడా చనుబాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తన బిడ్డ కి మాత్రమే కాకుండా అనేక చిన్నపిల్లలకు తల్లిపాలను అందించి వారి ప్రాణాలను కాపాడిన నిధి పర్మార్ హిరానందాకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju