NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పదవి విరమణ తర్వాత….. నిమ్మగడ్డ??

జగన్ ప్రభుత్వంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఢీ అంటే ఢీ ఆఖరికి పంతం నెగ్గించుకుని.. తన సత్తా చూపించి వరకు హైకోర్టు బెంచి తుది తీర్పు లో ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పు రాబట్టుకున్న కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవి కాలం తర్వాత ఏం చేయబోతున్నారు? మార్చి చివరినాటికి రిటైర్ కాబోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీ కాలం తర్వాత నిశ్శబ్దంగా ఉండి పోతారా లేక రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేది ఆసక్తి గా ఉంది. రమేష్ కుమార్ సామాజికవర్గం నుంచి మాత్రం ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి తగు సేవలు అందిస్తే బాగుంటుందని డిమాండ్ విపరీతంగా వస్తోంది. దీనికి సైతం కమ్మ వర్గానికి చెందిన పెద్దలు దీనికి తగు ప్రతిపాదనలు చంద్రబాబు చేస్తున్నారు. పదవీ విరమణ తర్వాత నిమ్మగడ్డకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న దానిమీద అప్పుడే కమ్మ సామాజిక వర్గం లో చర్చలు మొదలయ్యాయి.

హీరోగా మారి!!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొండిపట్టు గా ఉండిపోయారు. తనకున్న స్వతంత్ర అధికారాలను మార్చే హక్కు చట్టబద్ధంగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి ఎందుకు ఆయన సిద్ధమయ్యారు. జగ మొండి ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్ ను దీటుగా ఎదుర్కోవడంలో న్యాయపరంగా ముందుకు వెళ్లడం లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూపిన చొరవ ఒక రకంగా చెప్పాలంటే సాహసమే. ప్రభుత్వంతో రాజీపడి వారు చెప్పిన దాని ప్రకారం ఎన్నికల నిర్వహణ తేదీలను నిర్ణయించుకుంటే రమేష్కుమార్ పెద్దగా లైం లైట్ లోకి వచ్చి ఉండేవారు కాదు. అయితే హైకోర్టు సింగిల్ సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా పూర్తిస్థాయి బెంచ్కు మళ్లీ కోర్టును ఆపిల్ చేయడంలో దాని తర్వాత విజయం సాధించడంలో రమేష్ కుమార్ తెలివితేటలు బాగా పనికొచ్చాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వానికి మధ్య గతంలో ఏర్పడిన వివాదాలను అప్పుడు కోర్టు సూచించిన అంశాలను హైకోర్టు ముందు ఉంచడంలో తర్వాత దానికి అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంలో ఆయన చతురత పని చేసింది.

 

రాజకీయాల్లోకి వస్తే..

1985 బ్యాచ్ కు చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ శ్రీకాకుళం కలెక్టర్గా పనిచేశారు. దాని తర్వాత ఎక్కువగా పరిపాలన అంశాలకు సంబంధించి అధికారి గానే ఉండిపోయారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ న్యాయశాస్త్రంలో ఎల్.ఎల్.బి చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు న్యాయపరంగా ఉన్న కొన్ని అంశాలు గురించి అవగాహన ఉంది. ఇదే ఇప్పుడు ఆయనకు మంచి చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉన్న అధికారాలు విధులు కు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు న్యాయపరంగా రాజ్యాంగపరంగా ఉన్న ఒక అవకాశాలను స్టడీ చేశారు. దానికి అనుగుణంగానే ఆయన కోర్టులో ముందుకు వెళ్లారు. ఒక క్రమ పద్ధతిలో ఎవరి మీద ఆధారపడకుండా అడ్వకేట్స్ చెప్పినది వినకుండా కేవలం తన సొంత నాలెడ్జి తో న్యాయశాస్త్రం మీద ఉన్న పట్టు తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు సాగటం విశేషం. తన ఆఫీసులో ఉన్న వారు సైతం ప్రభుత్వానికి వేగులు గా పని చేస్తున్నారని గుర్తించిన రమేష్ కుమార్… ఇతరులెవరూ మీద ఆధారపడకుండా ఆయన పని ఆయనే చేసుకున్నారు. అన్ని విషయాలను సొంతంగా చక్క బెట్టారు.

ఆయన నిర్ణయమే కీలకం!

** పదవీ విరమణ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఒకవేళ వస్తే అది ఏ పార్టీ నుంచి వస్తారు అనేది… ఇప్పటికే ఆయన సామాజిక వర్గ పెద్దలు డీసైడ్ చేశారు. ప్రస్తుతము కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి మొండిఘటం.. పరిపాలన మీద పట్టు ఉన్న వారు చతురతతో రాజకీయాలు చేసే వారు అవసరం అని ఆయా కుల పెద్దలు ఇప్పటికే డిసైడ్ చేశారు. దీని పై నిమ్మగడ్డ రమేష్ కు సైతం ఓ ప్రతిపాదన వెళ్లినట్లు సమాచారం. పదవీ విరమణ తర్వాత కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వాలని పార్టీలోకి వస్తే మరీ మంచిదని, ఆయనకు తగిన గౌరవం చంద్రబాబు కల్పించాలనే ది ఇప్పటికే కుల పెద్దలు డిసైడ్ అయ్యారు. దీంతోపాటు కమ్మ వర్గానికి చెందిన యువత సైతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయపరంగా జగన్ ప్రభుత్వం తో చేస్తున్న ఫైట్ ను స్వాగతిస్తున్నారు. ఇప్పుడు వారికీ ఒక అద్భుతమైన హీరోగా నిమ్మగడ్డ కనిపిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనసులో ఏముంది అనేది… పదవీ కాలం తర్వాత ఆయన ఎలాంటి అడుగులు వేస్తారు అనేది కాలమే నిర్ణయించాలి.

author avatar
Comrade CHE

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju