NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ముస్లిం గాలి పటం దేశమంతా ఎగురుతుందా ? ఎంఐఎం వ్యూహమేంటి?

 

 

అల్ ఇండియా మజ్లీస్ – ఈ – ఇత్తెహాదు – ఉల్ – ముస్లీమీన్ (ఎంఐఎం) ఈ పేరు చెబితే ఎవరికీ కనీసం అర్ధం కాకపోవచ్చు. కానీ హైద్రాబాద్ పాతబస్తీ మజ్లీస్ పార్టీ అంటే తెలుగు రాష్ట్రాల్లో అర్ధం కానీ వారు ఉండరు. పార్టీ పేరులోనే ముస్లిమ్స్ ఐక్యత కనబర్చే మజ్లీస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిని సమాయత్త పరిచి ఒకే గొడుగు కిందకు తీస్కువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా బీహార్ లో సైతం మజ్లీస్ పార్టీ సత్తా చాటి 5 స్థానాల్లో నెగ్గింది. 24 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెడితే, ముస్లిం ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉండే అమౌర్, కోచిదమాన, జోకిహాట్, బైసి, బహదూర్ గంజ్ ప్రాంతాల్లో తమ అభ్యర్థుల్ని నెగ్గించుకుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఎంఐఎం గురించి ముస్లిం వర్గాల్లో చర్చ రేగింది. ముస్లిం పెద్దలు పార్టీ గురించి, మూలాల గురించి ఆరా తీస్తున్నారు.

ఒక్కో అడుగుతో వ్యూహం

హైద్రాబాద్, సికింద్రాబాద్ దాటి బయటప్రాంతాల్లో పట్టు లేదని, ముస్లిం వర్గాలే ఎంఐఎంను నమ్మవని గతంలో రాజకీయ ప్రత్యర్ధులు గేలి చేసేవారు. దాన్ని దాటి పార్టీను జాతీయ స్థాయిలో తీసుకెళ్లడంలో అక్బరుద్దీన్ ఓవైసి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లారు.
* ఎంఐఎం పార్టీను మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని ముస్లిం ప్రభావం ఎక్కువగా ప్రాంతాల్లో పటిష్టం చేసారు. ఆయా ప్రాంతాల్లో కమిటీలు వేశారు. ముస్లిమ్స్ అందరు తమ పార్టీగా అనుకోవడానికి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించేవారు. కరీంనగర్లో పూర్తిస్థాయి పోటీ ఇచ్చేలా పార్టీను తీర్చిదిద్ది అక్కడి నుంచి పోటీ మొదలుపెట్టారు. కరీంనగర్లో గెలవకపోయిన బయట ప్రాంతాల్లో పోటీ చేసి పట్టు నిలుపుకున్న పార్టీ మీద ముస్లిమ్స్ ద్రుష్టి పెట్టడం మొదలు పెట్టారు. అలా ఎంఐఎంను ముస్లిమ్స్ ప్రభావితం చేసే ఓటర్లు ఉన్నా స్థానాల్లో పోటీకి నిలపాలని నిర్ణయించారు.
* మహారాష్ట్ర లో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అక్కడ 2 కీలక అసెంబ్లీ స్థానాలు గెల్చుకుని ఇతర పార్టీలకు షాక్ ఇచ్చింది. కనీసం కేడర్ కూడా లేని ఆ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు గెల్చుకోవడమే కాదు, ఒక లోకసభ సీట్ సాధించింది. ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రెండో లార్జెస్ట్ పార్టీగా ఎంఐఎం రావడంతో పార్టీ నేత అక్బరుద్దీన్ పార్టీను ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీకి దింపాలని భావించారు.
* బీహార్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయం సాధించినట్లే. దీనికి పార్టీ నేత వ్యూహాలే కాదు. పార్టీను ముస్లిమ్స్ తమ సొంత పార్టీగా ఓన్ చేసుకుంటున్నారు అనేది సర్వేల్లో తేలింది. కర్ణాటక ఎన్నికల్లో పార్టీను పోటీకి నిలపకపోవడంలో సైతం అక్బర్ వ్యూహం చాల ఉంది అనేది విశ్లేషకుల మాట. బీహార్ లో ముస్లిం ఓటర్లు 7 కోట్ల మంది ఓటర్లలో 16 . 9 శాతం ఉన్నారు. అంటే దాదాపు కోటిమంది ఓటర్లను ప్రభావితం చేయవచ్చని, పార్టీను ఉత్తరాదిలో పరిచయం చేస్తే అక్కడ వచ్చే స్పందన తెలుసుకోవచ్చని చేసిన పయత్నం మొదటి అడుగులోనే ఫలించింది.

 


* మహ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో అల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేది. దేశంలోని ముస్లింలకు అది నాయకత్వం వహించేది. పాకిస్థాన్ తో విడిపోయిన తర్వాత ముస్లిం లీగ్ ఆ దేశపు పార్టీ అయ్యింది. ఇండియాలో ఉండిపోయిన ముస్లింలకు పదవులు దక్కాయి తప్పితే వారికీ ప్రత్యేక పార్టీలు లేవు. స్థానికంగా అక్కడక్కడా చిన్న పార్టీలు ఉన్నా దేశవ్యాప్తంగా ముస్లింలకు తమ సొంతం అనుకునే పార్టీగా ముస్లిం లీగ్ తర్వాత ఎంఐఎంను నిలపాలన్నదే అక్బరుద్దీన్ ఓవైసి వ్యూహంగా తెలుస్తోంది.
* ముస్లింలలో వివిధ వర్గాలు ఉంటాయి. అందరిని ఒకే తాటి మీదకు తెచ్చేలా చేయడమే ఇప్పుడు అక్బరుద్దీన్ ముందు ఉన్న పెద్ద టాస్క్. ఎంఐఎం పార్టీకు కొన్ని ముస్లిన్మ్ వర్గాల్లో విబేధాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకుంటేనే జాతీయ పార్టీ అవుతుంది. వీటిని ఎలా తెగ్గొడతారు అనేది ఆసక్తికరం.
* కాంగ్రెస్ కు తోక గా, బీజేపీకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం పోటీ చేస్తుంది అనే ప్రచారం అన్ని చోట్ల బలంగా ఉంది. దీని నుంచి బయటపడాలి. గెలుపు కోసం మాత్రమే పోటీ అనేది జనంలోకి వెళితేనే పట్టు పెరుగుతుంది. అలాగే ముస్లిం ప్రాంతాల నుంచి ఎలాంటి మద్దతు సాధిస్తుంది అనేది చూడాలి. ఇవన్నీ సాఫీగా సాగితేనే ఎంఐఎం ముస్లింల రాజకీయ కేంద్రం అవుతుంది. అయితే వేస్తున్న అడుగుల్లో ఎక్కడ తడబాటు లేకపోవడం, అన్ని ప్రాంతాల ముస్లిం సోదరులు మద్దతుగా నిలవడం ఎంఐఎం కు జోష్ తెస్తున్నాయి.

author avatar
Special Bureau

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?