NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ ఆ ఒక్క పని చేస్తే వైసీపీ సమస్యలన్నీ తీరిపోయినట్లే….!

పాలన చేపట్టినప్పటి నుండి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి ఎన్నడూ లేదని చెప్పాలి. హైకోర్టులో ఎదురు దెబ్బలు, ఎన్నికల కమిషన్ తో వివాదం మధ్య అంతర్గత కలహాలు కూడా వైసీపీ ని కొద్దిగా బాధిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన ఆ వ్యతిరేకత ను తగ్గించుకుని పార్టీని పుంజుకునే చేయాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అతనిని ఈ పరిస్థితి నుండి బయటపడవేసే కీలకమైన ఆయుధం ఏమిటి…?

 

విభజనే విజయం..!

ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గ ఆధారంగా 25 జిల్లాలు చేస్తానని గత ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించాడు. అనుకున్న విధంగానే పనులు సత్వరంగా ప్రారంభమయ్యాయి. అభివృద్ధిని పరుగులు పెట్టించడం ఒకటే ఆలస్యం అన్నది టాక్. అరకు లాంటి అతి పెద్ద గిరిజన నియోజకవర్గాన్ని రెండు జిల్లాలకు విభజించాలని పార్టీ నేతలు డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని మొత్తం ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అడుగు ముందుకు వేస్తున్నారు. దాంతో పాటు ఆదోని, అమరావతి జిల్లాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అయితే సంఖ్య ఖరారు కాలేదు కానీ అన్ని వర్గాల ప్రజలను శాంతపరిచేలా విభజన జరుగుతుంది అన్నది మాత్రం ఖాయం.

పెద్ద హెల్ప్ మరి..!

ఇక జిల్లాల విభజన పూర్తి అయితే పాలన మరింత సులువుగా జరుగుతుంది. వైజాగ్ కేంద్రంగా జగన్ చేయాలనుకుంటున్నా అభివృద్ధిని సులువుగా చేయగలమని వైసీపీ బృందాలు భావిస్తున్నాయి. జిల్లాల ప్రక్రియ వచ్చే ఏడాది జరగనున్న జనాభా గణన చేయాలని కేంద్రం రాష్ట్రానికి స్పష్టం చేసింది. కాబట్టి కొనాళ్ళు ఈ ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేసింది కానీ అండర్ గ్రౌండ్ వర్క్ మాత్రం జరుగుతూనే ఉంది. ఇక ప్రజల్లో, జిల్లాల్లో పార్టీ పుంజుకోవడం అనేది జిల్లాల ఏర్పాటు తో బాగా సాధ్యం అవుతుందని ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఈ విభజన బాగా తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నాణేనికి మరో వైపు…!

ఇదంతా పక్కన పెడితే 3 రాజధానుల ప్రతిపాదన, పోలవరం విఫలం, కేంద్రం నుండి నిధులు రాబట్టి లేని పరిస్థితి మరోవైపు పుంజుకుంటున్న వ్యతిరేక పార్టీలు వైసీపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అదీ కాకుండా గతంలో కేసీఆర్ సర్కారు జిల్లాల విభజన చేపట్టి పది జిల్లాలను 33 వరకు పెంచారు. అయితే జిల్లాలు ఏర్పడి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఉన్నతస్థాయి అధికారులు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అభివృద్ధి నిధులు కేటాయించడం వంటివి సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ విభజన విజయవంతంగా చేపడితే ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం ప్రతిపక్షాలకు శక్తికి మించిన పనే అవుతుంది

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk