NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Amaravathi 500 Days: ఇక్కడ ఎన్నైనా ఆడండి..! అమరావతి చివరి బంతి ఢిల్లీలోనే..!!

Amaravathi 500 Days: last Game in Delhi Analysis

Amaravathi 500 Days: ఏపీలో ఇప్పుడు ఏమైనా పెద్ద ఇష్యూ ఉంది అంటే అది అమరావతి మాత్రమే.. రాజధాని వికేంద్రీకరణ మాత్రమే.. జగన్ సీఎం అయినా రెండేళ్లలో రాజధాని విషయంలో ఆయన ముద్ర పాజిటివ్ గా వేసుకోలేదు. చంద్రబాబు పాలించిన ఐదేళ్లలో అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ.. అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. శాశ్వత నిర్మాణాలు ఏమి జరగనప్పటికీ.. అమరావతి అనే ఒక సెంటిమెంట్ ని రగల్చగలిగారు.. ఆ సెంటిమెంట్ పోగొట్టే పనిలో జగన్ రాజధాని ఉనికినే ప్రమాదంలో పడేసారు..! అందుకే అమరావతి కోసం ఒక మిశ్రమ పోరాటం 500 రోజులు నుండి సాగుతుంది. దీనికి అంతం ఎప్పుడు..!? ముగింపు ఎక్కడ..? ఎలా..? ఇవే అందరి మదిలో రగులుతున్న ప్రశ్నలు.

Amaravathi 500 Days: last Game in Delhi Analysis
Amaravathi 500 Days last Game in Delhi Analysis

Amaravathi 500 Days: కొన్ని మార్గాలున్నాయి.. ఇప్పటికి ఇలా..!!

ఈ వివాదం ముగింపునకు కొన్ని మార్గాలున్నాయి. కోర్టుల రూపంలో దారులున్నాయి. ఈ 500 రోజుల పోరాటంలో వారికి ఒక పెద్ద గెలుపు మూడు రాజధానుల బిల్లుపై “స్టే” కొనసాగుతుండడం.. ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ కూడా అదే.. ఇక మిగిలిన వ్యవహారం కూడా కోర్టులే తేల్చాల్సి ఉంది. రాజధాని వికేంద్రీకరణని వ్యతిరేకిస్తూ “అమరావతి పరిరక్షణ సమితి”తో సహా వివిధ వర్గాలు సుమారుగా 136 పిటిషన్లు వేసాయి. వీటిని కోర్టు జల్లెడ పట్టి కొన్నింటిని కొట్టేసింది. కొన్నింటిని కలిపేసింది. అలా 40 పిటిషన్లు రూపంలో వాదనలు వింటుంది. మొదట్లోనే పిటిషనర్ల వాదనలతో ఏకీభవించి రాజధాని వికేంద్రీకరణపై స్టే ఇచ్చింది. పూర్తిస్థాయిలో వాదనలు వినడానికి మొగ్గు చూపింది. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరీ ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం అనేక వాదనలు విన్నది.

Must Read : అమరావతి గొడవ – మూడు రాజధానుల వివాదంతో రాష్ట్రానికి ఒరిగేదేమిటి..!?

Amaravathi 500 Days: last Game in Delhi Analysis
Amaravathi 500 Days last Game in Delhi Analysis

వాయిదాలు.. వాయిదాలు..! జస్టిస్ అరూప్ ఏం చేస్తారో..!?

ఆ పిటిషన్ ని పలుమార్లు వాయిదాలు వేస్తూ.. అమరావతి నిర్మాణానికి ఖర్చు చేసిన వ్యయం లెక్కలు.. సేకరించిన భూమి వివరాలు.. భూములిచ్చిన రైతుల కులాలు.., అమరావతి పరిసరాల్లో నిర్మించిన ప్రభుత్వ భవనాల వివరాలు.. ఇలా అన్ని రకాల సమాచారాన్ని తెప్పించుకుంది. గత ఏడాది ఆగష్టు నుండి అక్టోబర్ వరకు తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరీ బదిలీ జరగడం.., ఆయన స్థానంలో అరూప్ గోస్వామి రావడంతో ఈ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది. అత్యంత కీలకమైన కేసు. విచారణ మధ్యలో నుండి కొనసాగిస్తారా..?. లేదా ఫ్రెష్ గా వాదనలు వింటారా..!? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన వాదనలు మొదటి నుండి వినడానికి మొగ్గు చూపారు. దీంతో ఈ ఏడాది ఉగాది నాటికి రాజధాని తరలింపు జరిగిపోతుంది అనుకున్న ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పై ఆ పిటిషన్ల విచారణ దశలో ఉంది.

Amaravathi 500 Days: last Game in Delhi Analysis
Amaravathi 500 Days last Game in Delhi Analysis

ఢిల్లీలోనే చివరి బంతి ఆట..!!

ఇది ఇక్కడితో తేలే అంశం కాదు. ప్రభుత్వానికి తొందర ఉంది. రైతులు ఉద్యమం వదలడం లేదు. కోర్టులు తేల్చడం లేదు. ఒకవేళ రాబోయే రెండు, మూడు నెలల్లో హైకోర్టు దీనిపై ఏదో ఒక తీర్పు ఇచ్చేసినా విషయం కచ్చితంగా సుప్రీమ్ కోర్టు వరకు వెళ్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీమ్ కి కచ్చితంగా వెళ్తుంది. పిటిషనర్ల వ్యతిరేక తీర్పు వస్తే రైతులే సుప్రీమ్ కి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఇక్కడితో ఇది ముగిసే అంశం కాదు. జగన్ అనుకుంటున్నా మూడు రాజధానులు ఇప్పుడే తెమలదు. సుప్రీమ్ లో కూడా కొన్ని ట్విస్టులుంటాయి. అక్కడ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ పిటిషన్ ని విచారిస్తారా..!? లేదా పక్క బెంచీకి ఇస్తారా..? అనేది కూడా కొన్ని అనుమానాలే. అది వివాదాస్పదం అవకాశాలు లేకపోలేదు.

author avatar
Srinivas Manem

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!