Amaravathi 500 Days: అమరావతి @ 500 రోజులు – రాష్ట్రానికి ఒరిగిందేమిటి..!?

AP High Court: CM Future depending on HCCJ
Share

Amaravathi 500 Days: అధికారంలో ఉన్న పాలకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది రాష్ట్రానికి, వారి పార్టీకి, పాలకుడికీ అన్ని వైపులా ప్రయోజనకరంగా ఉండాలి..! కానీ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా ఎవరికీ ప్రయోజనం అనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది..! ఏపీలో గడిచిన ఏడాదిన్నర నుండి రాష్ట్రంలో రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి లేదు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి పేరిట ఆడిన రాజకీయా ఆటలకు.. నడిపిన బాగోతాలకు.., చేసిన అక్రమాలకూ ఇప్పుడు అమరావతి బలయింది.

Amaravathi 500 Days: What is Use for State/ CM
Amaravathi 500 Days: What is Use for State/ CM

Amaravathi 500 Days: జగన్ చాలా ఆలోచించే ముందుకు దూకారు.. కానీ…!

రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ అనేది ఒక అసాధారణ నిర్ణయం. సాహసోపేతమైన నిర్ణయం. అయిదేళ్ల కిందట ముందు ప్రభుత్వ ఏర్పాటు చేసిన రాజధానిని.. అప్పుడప్పుడే సెంటిమెంట్ గా ఏర్పడుతున్న రాజధానిని మార్చేయడం అంటే జగన్ ఒక పెద్ద సాహసం చేసినట్టే.. ఎందుకంటే…! ఆ రాజధానిలో నడిపిన అక్రమాలు.., గత పాలకుల భూ బాగోతాలు.., వారి రాజకీయ అడుగులు జగన్ ని ఇలా నడిపించాయి. తనకూ అలంటి అవకాశమే కావాలి అనిపించి విశాఖపై కన్ను పడేలా చేశాయి. “టీడీపీకి రాజకీయంగా ఇబ్బంది పెట్టడం.. వారి అవినీతి బయటకు తీయడం” అనే ఉద్దేశంతో వచ్చిన రాజధాని మార్పు ఇప్పటికీ లక్ష్యం దిశగా వెళ్లడం లేదు..! దారి తప్పి బంతి కోర్టుకి చేరింది.

Must Read : అమరావతి ఉద్యమంలో కొన్ని ఓవర్ యాక్షన్స్ ఈ వార్తలో చూడండి..!!

Amaravathi 500 Days: What is Use for State/ CM
Amaravathi 500 Days: What is Use for State/ CM

జగన్ చేసిందేమిటి..!? గురి ఎక్కడ ఆగింది..!?

2019 ఎన్నికలు ముగిశాక వైసీపీ అధికారంలోకి వచ్చింది. తిరుగులేని మెజారిటీతో జగన్ సీఎం అయ్యారు. పాలన స్టార్ట్ చేసారు. అంతా బాగానే ఉంది. టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆ పార్టీకి ఎమ్మెల్యేలను దూరం చేయాలి, రాజధాని అమరావతిలో చంద్రబాబు ముద్ర చెరపాలి.

* ఆ రెండూ అమలు చేయడం ప్రారంభించారు. నిజానికి పార్టీల ఫిరాయింపులకు జగన్ వ్యతిరేకం… 2014 నుండి 2019 రావుకు అదే ఏడ్చారు… కానీ టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారు…? టీడీపీ ఎమ్మెల్యేలను అధికార పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా చంద్రబాబుని దెబ్బ కొట్టొచ్చు అనేది జగన్ వ్యూహం. అందుకే ఫిరాయింపులకు ఒకే అన్నారు.
* ఇక రెండో అంశం రాజధాని మార్పు. పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని మారిస్తే టీడీపీ ముద్ర అమరావతిపై పోతుంది. అందుకే రాజధాని మార్పునకు శ్రీకారం చుట్టారు. కానీ అక్కడ ఒకరకమైన కృత్రిమ ఉద్యమం ఆరంభమైంది. ఇప్పటికే 500 రోజులు పూర్తి చేసుకుంది. నాటి చంద్రబాబు పాపాలు.. నేటి జగన్ ఆటలు కలిపి రాజధాని రాజకీయం ఉధృతంగా సాగుతుంది..!

Amaravathi 500 Days: What is Use for State/ CM
Amaravathi 500 Days: What is Use for State/ CM

వైసీపీలో అంతర్మధనం మొదలు…!

రాజధాని మార్పులో మొదటి అడుగులోనే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లుపై ఏడాది కిందటే కోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత రాజధాని అంశంపై వైసీపీ నాయకులు ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. కొన్ని నెలల నుండి వైసీపీలో ఒకరకమైన అంతర్మధనం మొదలయింది. ఆ పార్టీ అంతర్గత చర్చల్లో ఈ పాయింట్లు వస్తున్నాయి..! * రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పార్టీ బలంగానే ఉంది. కృష్ణ, గుంటూరు జిల్లాలో కూడా ఆశించిన కంటే ఎక్కువ స్థానాలే వచ్చాయి. రాజధాని వికేంద్రీకరణ విశాఖని పరిపాలన రాజధానిగా చేయడం వలన వైసిపీ విశాఖ, ఉత్తరాంధ్ర, కర్నూలు జిల్లాల్లో కూడా బలపడుతుందని ఆశించవచ్చు.. కానీ అక్కడ ఇప్పుడు పార్టీ ఏమి బలహీనంగా లేదు..! * “రాష్ట్రంలో 5 , 6 జిల్లాలు (పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) జిల్లాలు వ్యతిరేకిస్తున్న పాలనా వికేంద్రీకరణను అమలు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా ఆయా జిల్లాల్లో దెబ్బతింటాం. అది పార్టీకి ఎదురు దెబ్బ అవుతుంది. అనే చర్చలు జరుగుతున్నట్టు సమాచారం..!


Share

Related posts

ఇంకేం పని లేదు..!! పత్రికలు మూసేయండి..! చానెళ్లు అమ్మేయండి..!!

Special Bureau

‘రఫేల్’ గురించి అంబానీకి ముందే తెలుసా?

Siva Prasad

బ్రేకింగ్: ఆంగ్ల మాధ్యమం విషయంలో కూడా ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

Vihari