NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Amaravati Scam: ఆ 1000 కోట్లు స్కామ్ ఏమిటి..!? అమరావతి డొంక కదిలింది..!!

Amaravati Scam: 1000 Crores Scam Proves YSRCP Allegations

Amaravati Scam: “అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది.. రూ. లక్ష కోట్లు అవినీతి జరిగింది.. అక్కడ మొత్తం ఒకే సామాజికవర్గం దిగింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది..” ఇవన్నీ వైసీపీ నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా పలుమార్లు ఇవే తరహా ఆరోపణలు చేశారు. కానీ చేతిలో అధికారం ఉన్నప్పటికీ న్యాయపరంగా నిరూపించలేకపోయారు.. అందుకే అమరావతి అంతర్గత అవినీతి విషయంలో టీడీపీ సేఫ్ అనే భావన కొన్ని వర్గాల్లోకి వెళ్ళింది..! అయితే తాజాగా బయటకు వచ్చిన ఒక స్కామ్.. ఓ అవినీతి వ్యవహారం మళ్ళీ “అమరావతిలో అవినీతి” చుట్టూ తిరగడం ప్రారంభించింది.. రూ. 100 కోట్లు మేరకు బయటకు వచ్చిన ఈ స్కామ్ కీ, అమరావతికి సంబంధం ఏమిటో చూద్దాం..!

Amaravati Scam: కార్వే ఓనర్ ఏం చేసాడంటే..!?

“కార్వే” అనే సంస్థ అందరికీ తెలిసిందే.. స్టాక్ బ్రోకర్ కంపెనీ.. అంటే పెట్టుబడిదారుల నుండి నగదు తీసుకుని.. వివిధ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టి.. దాన్ని పెంచి మళ్ళీ వారికి అందిస్తుంటుంది. దాని చైర్మన్ పార్ధసారధి.. టీడీపీకి అనుకూలుడు.. అప్పట్లో సత్యం రామలింగరాజు, టీడీపీ పెద్దలు అందరూ కలిసే బాగా బిజినెస్సుల్లో చేసేవారు..! అయితే 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ కార్వే సంస్థ లావాదేవీలు ఏపీలో బాగా పెరిగాయి. అందుకే తమ సంస్థల్లోకి పెట్టుబడులుగా వచ్చిన కొన్ని నిధులను టీడీపీ మానసపుత్రిక అమరావతిలోకి మళ్ళించారు.. ఇలా దాదాపు రూ. 100 కోట్లు మేరకు పెట్టుబడులు పెట్టి అమరావతిలో భూములు కొనుగోలు చేసారు. పక్కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే చేశారు. కానీ అది రివర్స్ అయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిలో భూములు ధరలు తగ్గడంతో ఆయన పెట్టిన రూ. 1000 కోట్లు విలువ.. రూ. 250 కోట్లకు పడిపోయింది. ఇంకేముంది.. జనం సొమ్ముతో బిజినెస్ చేయబోయి.. చతికిలపడ్డాడు.. ఇదే కాదు ఇంకా ఉంది..

Amaravati Scam: 1000 Crores Scam Proves YSRCP Allegations
Amaravati Scam 1000 Crores Scam Proves YSRCP Allegations

మరో రూ. 2800 కోట్లుపై ఈడీ నిఘా..!?

ఈ వెయ్యి కోట్లు లెక్క దొరికింది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడినట్టు పక్కాగా అధరాలు దొరికాయి. ప్రస్తుతం ఈడీ దీనిపై దృష్టి పెట్టింది. అయితే.. ఇంకా ఈ కార్వే సంస్థ మరో రూ. 2800 కోట్ల నిధులను కూడా లెక్కల్లోకి రాణి బిజినెస్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. పెట్టుబడుల కోసం వచ్చిన డబ్బుతో స్టాక్స్ కొని.. జాగ్రత్తగా సెక్యూరిటీ బిజినెస్ చేసుకోకుండా.. ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఆ పెట్టుబడుల షేర్లు తాకట్టు పెట్టి.. రుణాలు పొంది.. అవి నష్టపోయాక దివాళా తీశారు. అలా అమరావతిలో పెట్టిన డబ్బు, మరో తాకట్టు పెట్టిన డబ్బు మొత్తం పోయి.. ప్రస్తుతం అరెస్టయ్యారు. ఈ అరెస్టు, డిపాజిట్లు తాకట్టు అంశాలన్నీ నాలుగు నెలల కిందటే తెరపైకి వచ్చినప్పటికీ.. అమరావతిలో రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిన అంశం మాత్రం నిన్ననే తెరపైకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా “అమరావతి ఇన్ సైడర్” అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ వాదనకు బలం దొరికింది. టీడీపీ వాదనకు నీరసం ఆవహించింది. ఏపీ సీఐడీ కూడా ఇటువంటి మరిన్ని కంపెనీలను పట్టుకునే పనిలో ఉంది. అమరావతి ఇన్ సైడర్ పై మరింత డొంక లాగే పనిలో ఉన్నట్టు సమాచారం..!

 

author avatar
Srinivas Manem

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju