NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP BJP : “వికాసం ముంగిట విలాపం”..! రెండు నెలల్లో బోల్తా పడిన బీజేపీ..!!

AP BJP : in Critical Political Situation

AP BJP : దేశం మొత్తం మీద బీజేపీకి మింగుడుపడని రాష్ట్రం.. కమలం అంటే ఓట్లు వేయని ఓటర్లు.. బీజేపీని ఏమాత్రం పట్టించుకోని జనం ఎక్కడైనా ఉన్నారు అంటే అది ఏపీలో మాత్రమే..! 1989 లో ఉత్తర ప్రదేశ్ లో మొదలుకుని.. ఒక్కో రాష్ట్రానికి పాకుతున్న బీజేపీ బలం ఏపీలో పెరిగింది లేదు. టీడీపీతో పొత్తు పుణ్యామాని ఆ పార్టీకి కొన్ని మంత్రి పదవులు, ఎంపీ స్థానాలు దక్కేవి. 2019 లో ఒంటరిగా పోటీ చేసి చేతులు కాల్చుకుంది. ఇక దేశం మొత్తం పాకేస్తున్న కమల దళం.. ఏపీలో మాత్రం పాకలేకపోతుంది. ఈ సారి ఎలాగైనా గెలవాలి, నిలవాలి.. బీజేపీ బలం చూపించాలి అనుకుంటూ చాల ఆశలే పెట్టుకుంది. రాజకీయంగా చాలా అడుగులే వేసింది. చాల మందినే చేర్చుకుంది.. కానీ… నిష్ఫలితమే.. ఆ పార్టీ బలం ముంగిట దారుణంగా బోల్తా పడింది..!!

AP BJP : in Critical Political Situation
AP BJP in Critical Political Situation

AP BJP : విశాఖ వేదికగా వేసుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్..!!

రెండు నెలల కిందట వరకు ఏపీలో బీజేపీ అంటే పెద్దగా వ్యతిరేకత లేదు. అలా అని అనుకూలత కూడా లేదు. అక్కడక్కడా ఉన్నప్పటికీ.. సాధారణ జనం, యువత పట్టించుకునే వారు కాదు. కానీ ఏపీలో బలపడే క్రమంలో బీజేపీ చాలా ప్రణాళికలు వేసుకుంది. విశాఖ వేదికగా భారీగా చేరికలు పెట్టుకుంది. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ, కళా వెంకట్రావ్ సోదరుడి కుమారుడు, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, వీలైతే విశాఖ ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇలా… ఈ అందర్నీ చేర్చుకుని విశాఖ .. ఉత్తరాంధ్రలో బీజేపీ బలపడాలని ప్రణాళికలు వేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ చేరికలు పెట్టుకుని.. ఆ తర్వాత ఉభయగోదావరి, రాయలసీమ ప్రాంతంపై ఫోకస్ పెట్టాలని భావించింది. అన్నీ అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి.

AP BJP : in Critical Political Situation
AP BJP in Critical Political Situation

రెండు నెలల్లో ఎంత మార్పు..!?

రాజకీయ పార్టీ అంటే ఒడిదొడుకులు సహజమే. జాతీయ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక రాష్ట్రంలో ఎదగాలి అంటే.. ఆ రాష్ట్రానికి వరాలివ్వాలి. పథకాలు, ప్రాజెక్టులు, నిధులు ఇవ్వాలి. రాష్ట్రానికి మంచి చేసి తాము రాజకీయంగా ఎదగాలని భావించాలి. కానీ బీజేపీ అలా చేయడం లేదు. ఏపీకి చేయాల్సిన అన్యాయం చేసేస్తుంది. వేయాల్సిన దెబ్బలు వేసేస్తుంది. అన్నీ చేసేసి… ఏపీలో బలపడాలని చూస్తుంది. అందుకే ఈ రెండు నెలల్లో ఏపీలో ఆ పార్టీ పెద్ద బోల్తా కొట్టేసింది.
* పోలవరం నిధులు ఇవ్వడం లేదు.., కేంద్రం అన్యాయం చేస్తుంది అంటూ కొద్ది నెలల నుండి బీజేపీపై కొంత వ్యతిరేకత ఉండేది. అయితే అది అంతగా బయటకు రాలేదు.
* కానీ ఫిబ్రవరి మొదటి రోజున వచ్చిన బడ్జెట్ లో ఏపీకి నిధులు, ప్రాజెక్టులు ఏమి ఇవ్వలేదు. దీంతో ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తుంది అనే భావన గట్టిగా నాటుకుంది. ఏపీలో బీజేపీ విషయంలో అప్పటి నుండి వ్యతిరేక భావన మొదలయింది.

AP BJP : in Critical Political Situation
AP BJP in Critical Political Situation

* ఫిబ్రవరి రెండో వారం వచ్చేసరికి విశాఖ స్టీల్ ప్లాంట్ గొడవ మొదలయింది. ఏపీలో అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ విషయంలో బీజేపీనే ప్రధాన విలన్ గా మారిపోయింది. కేంద్రమే మొత్తం చేస్తుందని జనంలోకి వెళ్ళింది. నిజానికి వైసీపీ, టీడీపీలు రాజకీయంగా బీజేపీని టార్గెట్ చేయనప్పటికీ… దీనిపై అవగాహన ఉన్న అందరూ కేంద్రమే ఈ తప్పుని చేస్తుందని… బీజేపీనే ఏపీ పాలిట విలన్ అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. పోలవరానికి నిధులు ఇవ్వకపోవడం.., బడ్జెట్ లో అన్యాయం చేయడం.. పైగా ఇప్పుడు స్టీల్ పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తుండడంతో బీజేపీ పట్ల ఎన్నడూ లేని వ్యతిరేక ప్రచారం నాటుకుంది..!!

 

author avatar
Srinivas Manem

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N