AP BJP: పాపం.. నరం లేని నాలుక..! చేవ లేని నేత..!?

AP BJP: New Politics - News Poliitcs..!
Share

AP BJP: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలాన్ని సంతరించుకోవడానికి సిద్ధం అవుతోంది. వైసీపీకి వ్యతిరేకంగా ఓ పెద్ద పోరాటానికే సిద్ధం అవుతోంది. అసలు వైసీపీకి ప్రతిపక్షం తామే అన్న భావనలో బీజేపీ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో టీడీపీ అనేదే లేదు, జనసేన పార్టీ బీజేపీతో కలిపే ఉంది..! “ఎహె.. జోకులు చాల్లే.. అసలు మ్యాటర్ లోకి వచ్చేద్దాం అంటారా..!? సర్లే…!! అవి మనకు జోకులుగానే అనిపించినా బీజేపీకి మాత్రం యమా సీరియస్ అంశాలు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతున్నాం అనుకుంటున్నట్టే…, ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీకి ధీటుగా బీజేపీనే ప్రత్యామ్నాయం అని అనుకుంటూ సంతోషిస్తున్నారు..! అదే జనాలకు కూడా చెప్పాలని చూస్తోంది. నిజానికి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి అంత సీను లేదు అనేది అందరికీ తెలుసు. ఒక వేళ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఏదైనా ఉంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ కు ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని చూసుకుని, కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను చూసుకుని, కేంద్రంలో వ్యవస్థలు అన్నీ తమ చేతులో ఉండటాన్ని చూసుకుని బీజేపీ చాలా చాలా అతి ఆత్మ విశ్వాసంతో ఉంది. అసలే రాష్ట్రంలో జనసేనతో బీజేపీ దోస్తీ కొనసాగుతుందా లేదా అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే అంత కాన్ఫిడెంట్ గా బీజేపీ ఎందుకు ఉంది..? బీజేపీలో వస్తున్న నాయకుడు ఎవరు..? జనసేనతో పొత్తు కంటిన్యూ అవుతుందా..? మధ్యలో విడిపోతుందా ..? అనే విషయాలను పరిశీలిస్తే..!

AP BJP: New Politics - News Poliitcs..!
AP BJP: New Politics – News Poliitcs..!

AP BJP: రఘురామ చేరితే.. మరోలా ఖాయం..!!

ఏపీలో బీజేపీకి కొంచెం ఊపు రావాలంటే.., వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరడమే.. ఆయన కూడా అందుకు రెడీగా ఉన్నారు. ఆయన ప్లాన్ ఏమిటంటే.. “ఎలాగూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం అవుతున్నారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఉప ఎన్నికలకు వెళ్లడానికి సై అంటున్నారు. ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఆయనకు బలమైన శక్తి తోడు కావాలి. అందుకే బీజేపీని ఎంచుకున్నారు. వ్యవస్థలు అన్నీ బీజేపీ చేతిలో ఉంటాయి కాబట్టి.., ఎన్నికలకు స్పెషల్ ఆఫీసర్ ను వేయించుకోవాలన్నా, కేంద్ర బలగాలను రప్పించాలన్నా, రఘురామకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులు వ్యవహరించాలన్నా ఆయన బీజేపీలో చేరాలి. ఆయనకు బీజేపీ సపోర్టు చేయాలి..” కానీ దీనిలో ఒక పెద్ద మెలిక ఉంది “ఆయన బీజేపీ జండాతో పోటీ చేస్తే ఇక్కడ గెలిచే అవకాశాలు లేవు. ఇది అందరికీ తెలుసు. అందుకు టీడీపీ, జనసేన నూటికి నూరుశాతం సపోర్టు చేయాలి. అది జరిగితే కాస్త హోరాహోరీ ఉంటుంది.. అందుకే ఆయన బీజేపీ నుండి పోటీ చేస్తూ జనసేన, టీడీపీ మద్దతు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. రఘురామ కృష్ణంరాజు ఇక్కడ గెలిస్తే ఏపీ తరపున బీజేపీ ప్రతినిధిగా ఉంటారని కేంద్ర పార్టీ ఆశిస్తోంది.

AP BJP: New Politics - News Poliitcs..!
AP BJP: New Politics – News Poliitcs..!

AP BJP: బీజేపీ – జనసేన పొత్తు..!?

బీజేపీ – జనసేన పొత్తు కొనసాగుతుందా..? లేదా అన్న అనుమానాలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. బీజేపీ – జనసేన పొత్తులో అనేక ట్విస్ట్ ల ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీకి నాయకులు ఉన్నారు జెండాలు పట్టుకునే కార్యకర్తలు లేరు. బీజేపీకి నాయకత్వం కూడా కృత్రిమంగా వచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉండటం, పెద్ద పెద్ద వ్యవస్థలు అన్నీ వాళ్ల చేతిలో ఉన్నాయి కాబట్టి అవసరాల కోసం నేతలు ఆ గూటిలో చేరారు. ఉదాహరణకు తీసుకుంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితర నాయకులు వాళ్ల అవసరాల కోసం, వ్యవస్థల నుండి తప్పించుకోవడం కోసం కాషాయ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర బీజేపీలో పేరుకు పెద్ద పెద్ద నాయకులుగా ఉన్న వారు ఎవరూ ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నర్శింహరావు, సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది బీజేపీ నేతలు ఉన్నారు. వీళ్లు ఎక్కడైనా పోటీ చేసి గెలిచారా.. పోటీ చేసి గెలవగలరా అంటే లేదు. ఇటువంటి పార్టీతో జనసేన ఎంత కాలం కలిసి ఉంటుంది..జనసేన, బీజేపీ కలిసి మీటింగ్ పెడితే అక్కడ పాల్గొనే వాళ్లలో 90 నుండి 95 శాతం జనసేన అభిమానులు ఉంటే కేవలం 5 నుండి పది శాతం మంది బీజేపీ వాళ్లు ఉంటారు. జనసేన కార్యకర్తలే బీజేపీ జండాలను పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పార్టీతో ఎంత కాలం ఉండగలమనేది గ్రామ స్థాయి జనసేన కార్యకర్తల్లో ఉంది. అందుకే ఆ పార్టీ క్యాడర్ మాత్రం 2019 ఎన్నికలకు మాదిరిగానే జనసేన సింగిల్ గా పోటీ చేయాలని కోరుకుంటోంది. ఒక వేళ సింగిల్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేకుంటే బలమైన ప్రతిపక్షం టీడీపీతో కలిసి పోటీ చేయాలి అని కోరుకుంటున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. అసెంబ్లీలో జనసేన తరపున ప్రాతినిధ్యం వహించవచ్చు అని ఆ పార్టీలో కొందరు భావిస్తున్నారు. బీజేపీ కలిసి వద్దు అని క్యాడర్ చెబుతోందట.

AP BJP: New Politics - News Poliitcs..!
AP BJP: New Politics – News Poliitcs..!

ఏపీకి నష్టం చేస్తూ.. పొత్తు ఎలా..!?

క్షేత్ర స్థాయి బలం లేని బీజేపీ వల్ల ఉపయోగం లేదు అని జనసేన కార్యకర్తలు చెబుతున్నారుట. అందుకు ఉదాహరణ కూడా చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 57వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలం లక్ష ఓట్ల వరకూ ఉంటుంది. ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసినందున కనీసం లక్షా 20వేల ఓట్లు రావాలి. జనసేన పార్టీ వాళ్లు కూడా బీజేపీకి ఓటు వేయడానికి సిద్దపడటం లేదు అని అక్కడ వచ్చిన ఓట్ల బట్టే అర్ధం అవుతోంది. ఈ రెండున్నరేళ్లలో బీజేపీ – జనసేన కలిసి చేసిన ఆందోళనలు, పోరాటాలు ఏమి లేవు. ఆయా పార్టీలు వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళుతున్నాయి. అందుకే జనసేన – బీజేపీ పొత్తు ఫెయిల్ అయింది అని చెప్పవచ్చు. భవిష్యత్తులో జనసేన కలిసి ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. రాజకీయ అనుభవం, పోరాడేతత్వం ఉన్న ఎంపి రఘురామ కృష్ణంరాజును పార్టీలో ముందుగా చేర్చుకుని ఆ తరువాత గంటా శ్రీనివాసరావు, గద్దె బాబూరావు లాంటి వారిని చేర్చుకోవాలన్నది బీజేపీ ప్లాన్. కానీ బీజేపీ రాష్ట్రంలో ఎన్ని ఎత్తులు వేసినా ఎదగడం కష్టమే. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం లేదు. ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్టం హామీలను నెరవేర్చలేదు. విశాఖ స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదు అనేది అందరికీ తెలిసిందే. అందుకే రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు వేయడానికి ప్రజలు ఇష్టపడరు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది..!


Share

Related posts

Nimmagadda : వైసీపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చే ప్రయత్నంలో నిమ్మగడ్డ..? జగన్ అడ్డుకుంటారా?

somaraju sharma

బీజేపీ గెలుపుకు వైస్సార్సీపీ వ్యూహం : తిరుపతి సాక్షిగా జరిగేది ఇదే!!

Comrade CHE

ఒకే ఒక్క ఆటో డ్రైవర్ – జగన్ వల్ల ఎంత బెనిఫిట్ పొందాడో చూడండి

somaraju sharma