NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP BJP ; వెంకయ్య నాయుడు మళ్ళీ యాక్టీవ్..!? సోమూ సీటుకి ఎసరు – తెరపైకి కొత్త పేర్లు..!!

Venkaiah Naidu: Dark Politics into Higher Position..!?

AP BJP ; ఏపీలో బీజేపీ బలపడడం లేదు.. ఏం చేసినా బీజేపీ అంటేనే జనం అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది..! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం నిధులు ఈ అంశాలకు సరైన కారణాలను ప్రజలకు వివరించడంలో ఏపీ బీజేపీ నేతలు విఫలం అవుతున్నారు..! అందుకే ఈ అంశాల్లో బీజేపీ విలన్ గా మారుతుంది. నిజానికి ఇంతకంటే ఎక్కువ తప్పిదాలు, ద్రోహాలు, మాయలు, మర్మాలు చేసిన నేతలు/ పార్టీలు ఏపీలో దర్జాగా రాజకీయం చేసుకుంటున్నాయి. రెండు మూడు మాటలు మార్చేసి.. మడమలు తిప్పేసి.., యథేచ్ఛగా జనంలో కలిసిపోతున్నాయి. కానీ బీజేపీ మాత్రం చేసింది గోరంత ఉంటె.. ఆ ఫలితం కొండంత అనుభవిస్తుంది. దొంగలాగా మిగిలిపోతుంది. దీనికి కారణం మాటలతో కన్విన్స్ చేయగల నాయకులూ లేకపోవడమే..! అవును, ఏపీలో బీజేపీకి ఉన్న అతి పెద్ద లోటు ఇదే..!!

AP BJP ; Planning to Bring Back Venkaiah Naidu
AP BJP Planning to Bring Back Venkaiah Naidu

AP BJP ; సోము తిక్క తిక్క వాదనలు – బీజేపీకి పెద్ద మైనస్..!!

సోము వీర్రాజు ఎలా ఈ స్థాయికి వచ్చారో..? సోములో ఏం చూసి బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారో ఇప్పటికీ ఏపీలో కొందరికి ఇప్పటికీ అర్ధం కావడం లేదు. సరిగా, కన్విన్సింగ్ గా మాట్లాడడం.., ఎవరూ కనిపెట్టకుండా మాటలు మార్చడం.., తన మాటలను తానే కవర్ చేసుకోవడం.. మీడియా ఏమైనా అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పడం… కనీసం కేంద్రం బీజేపీ పెద్దలను కలిసి “ఏపీలో సమస్యలపై మేము పోరాడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం” అనే బిల్డప్ ఇవ్వడం… ఇవేమీ సోములో మచ్చుకి కూడా కనిపించవు. చీటికీ మాటికీ దొరికిపోతుంటారు. లాజిక్ లేని మాటలతో.., అర్ధం లేని వాదనలతో బీజేపీని దోషిగా నిలబెట్టేస్తుంటారు. మొన్నటికి మొన్న ఒక ఉదాహరణ చూసుకుంటే… గత నెల రెండో వారంలో ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ విషయం ఏపీలోని అనేక మీడియాల్లో వచ్చింది. దీనిపై సోము మీడియాతో మాట్లాడుతూ “ఏపీలో టీడీపీ, వైసిపి కలిసిపోయాయి. ఆ రెండు పార్టీలు కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. రాష్ట్రంలో హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసం విషయాలను పక్కకు నెట్టేస్తున్నాయి” అంటూ టీడీపీని, వైసీపీని ఇరుకున పెట్టేలా చెప్పారు. కానీ అది ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు. పైగా బీజేపీకి విశాఖ ఉక్కు కంటే ఏపీలో హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసమే కీలకం అనేలా జనంలోకి వెళ్ళింది. సోము మాటలతో బీజేపీకి పెద్ద దెబ్బ పడినట్లయింది. నేతృత్వంలో… ఇలా బీజేపీ విధానపరమైన తప్పులు చేసుకుంటూనే… ఏపీలో బీజేపీ రాజకీయంగా ఎదగడం అంటే వేప చెట్టు నుండి పాలు కారడం.. వినాయకుడు విగ్రహం పాలు తాగడం వంటిదే.. మూడు కాళ్ళ శిశువు జననం… వంటి వింతగానే మిగులుతుంది..!!

AP BJP ; Planning to Bring Back Venkaiah Naidu
AP BJP Planning to Bring Back Venkaiah Naidu

వెంకయ్య మళ్ళీ యాక్టీవ్ అయితే..!?

ఈ విషయాలన్నీ బీజేపీ పెద్దలకు తెలియక కాదు. తెలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వెలుగుతున్నాయి. ఏపీలో బీజేపీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వెంకయ్యనాయుడు. దశాబ్దాల తరబడి బీజేపీలో కిందిస్థాయి నుండి అనేక పదవుల్లో ఆయన పని చేశారు. రాష్ట్రంలో ఆయనపై ఒక్క మచ్చ కూడా లేదు. ఏపీలో బీజేపీ ఎప్పుడు ఎదగాలి అనుకున్నా వెంకయ్య వారధి వేసేవారు. అటువంటి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఆయన మళ్ళీ యాక్టీవ్ అయితే.. ఏపీలో తన వర్గం ద్వారా రాజకీయం నడిపితే.. బీజేపీ వాదనలు బాగా జనంలోకి తీసుకెళ్లగలిగితేనే రాష్ట్రంలో బీజేపీకి భవిత ఉంటుంది అని కేంద్ర పెద్దలు గుర్తించినట్టు తెలుస్తుంది. అందుకే మరో రెండు, మూడు నెలల్లో సోము సీటుకి సెలవు సీటీ ఇచ్చేసి.., వెంకయ్య వర్గం నుండి ఒకర్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది..!!

author avatar
Srinivas Manem

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju