Covid Hospital: ఏపీ ప్రభుత్వం అద్భుతం..! 15 రోజుల్లోనే కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం

ap build covid hospital in 15 days
Share

Covid Hospital: కోవిడ్ ఆసుపత్రి Covid Hospital ప్రస్తుత కరోనా సమయంలో దేశంలోని ఆసుపత్రుల్లో పలు మందిరాలు, మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్.. కోవిడ్ సేవలకు వినియోగించారు. అక్కడే కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందుతున్నాయి. అయితే.. కోవిడ్ ప్రారంభంలో దేశంలోకి ఇంకా కరోనా వ్యాపించక ముందు చైనాలో కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించి ఔరా అనిపించింది. ప్రపంచం అంతా గ్రేట్ అనుకున్నారు. మీడియా కూడా అలానే ఫోకస్ చేసింది. అటువంటి అద్భుతాన్నే ఏపీ ప్రభుత్వం చేసింది. అనంతపురం జిల్లాలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని 15 రోజుల్లోనే నిర్మించింది. దేశంలోనే 2వ ఆసుపత్రిగా జర్మన్ హ్యాంగర్ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా చేపట్టి పూర్తి చేసి చూపించింది ఏపీ ప్రభుత్వం.

ap build covid hospital in 15 days
ap build covid hospital in 15 days

వర్చువల్ విధానంలో ఈ ఆసుపత్రిని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించి అధికారులను ప్రశంసించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం కదిలి ఈ ఆసుపత్రిని నిర్మించింది. 11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రి తాత్కాలికమే అయినా ప్రతి కరోనా బాధితులకు సేవలు అందనున్నాయి. ప్రతి పడకకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసారు. అందుబాటులోనే నర్సింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. వెనుకబడిన జిల్లాగా పేరున్న అనంతపురంలోని తాడిపత్రి సమీపంలో అర్జాస్ స్టీల్స్ వద్ద ఆసుపత్రి నిర్మించడానికి ఓ కారణం ఉంది. దగ్గరలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఉండటంతో.. నేరుగా పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్ అందించే అవకాశం ఉండటంతో ఇక్కడ ఆసుపత్రి నిర్మించారు. ప్రస్తుత కరోనా సమయంలో కరోనా రోగులకు ఈ ఆసుపత్రి భరోసా ఇవ్వనుంది.

Read More: AP Politics: వైసీపీ సూపర్ ప్లాన్.. అందుకే మళ్ళీ రాజధాని రాజకీయం..!?

ఎక్కడో పొరుగు దేశంలో నిర్మించిన ఆసుపత్రి గురించి ప్రముఖ కథనాలుగా.. చైనా గొప్పదనంగా కీర్తించిన తెలుగు మీడియా.. సహజంగానే ఈ వార్తను పెద్దగా పట్టించుకోలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం పూనుకుని ఇటువంటి ఆసుపత్రిని వేగంగా నిర్మించడం విశేషం. పెద్దగా మౌలికవసతులు లేని ప్రాంతమే అయినా.. జిల్లాలోని కోవిడ్ బాధితులకు ఆసరాగా నిలువనుంది. తలచుకుంటే మనం కూడా అద్భుతాలు చేయగలమని దేశంలో ఎన్నో సందర్భాల్లో, సంఘటనల్లో నిరూపించింది. అయితే.. ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం తక్కువ సమయంలో ఒక విపత్తు సమయంలో నిర్మించిన ప్రభుత్వ గొప్పదనం గురించి చెప్పకపోయినా.. బాధితులకు సేవలు అందుతున్నాయి అని అయినా తెలియజేయాల్సి ఉంది.


Share

Related posts

పోలీసులను ఆశ్రయించిన బోండా ఉమా..!!

sekhar

విజయవాడలో ‘వర్మ’కు చుక్కెదురు

somaraju sharma

టేస్టీ పానీ పూరీ కోసం టాయిలెట్ వాటర్.. షాకింగ్ ఘటన!

Teja